రేవంత్ రెడ్డి.. ఇంత కీలకమైన పదవిలో ఉండగా.. ఆ పార్టీకి ఏ రకంగా మంచి భవిష్యత్తు ఏర్పడినా.. ఆ క్రెడిట్ పూర్తిగా తన ఖాతాలోకే వస్తుందనే నమ్మకం కూడా ఉన్న సమయంలోనే.. తెలుగుదేశాన్ని వీడుతున్నాడంటే చిన్న సంగతి కాదు. అసలే ముఠా కుమ్ములాటకు విపరీతమైన ఫేమస్ అయిన కాంగ్రెస్ పార్టీలో... ఎవరికి వారు తమను మించిన నాయకులు అనుకుంటూ గడిపేస్తుంటారు. తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి మరీ చిత్రం. తమను తాము ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావించుకునే వారు, ఏదో ఒక రకమైన కాంబినేషన్లలో ముఖ్యమంత్రి పీఠం తమను వరిస్తుందని సూట్లు కుట్టించుకుని సిద్ధంగా ఉంచుకునే వారు అనేకులు ఉన్నారు. అలాంటి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి తనే కీలకంగా చక్రం తిప్పడం సాధ్యమవుతుందని రేవంత్ ఎలా నమ్మి ఉంటారు? అనే అనుమానం పలువురికి కలగడం సహజం.
అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. తెలంగాణ కాంగ్రెస్ లో తెరమీద నుంచి కీలకంగా వ్యవహరించే ఓ నేత, తెర వెనుక అంతకంటె కీలకంగా వ్యవహరించే మరో సీనియర్ నేత ల అండదండలు రేవంత్ కు పుష్కలంగా ఉండడం వల్లే.. ఆయన నమ్మకంగా అటు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తె-కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జానారెడ్డి తో రేవంత్ కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రాకను.. స్వాగతిస్తున్న వారిలో ఆయన కూడా ఉన్నారు. అయితే పాత కొత్త సంగతుల్ని సరిపోల్చి చూసుకుంటే.. గతంలో ‘త్వరలో మా కాంగ్రెస్ కు ఓ బాహుబలి రాబోతున్నా’డంటూ జానారెడ్డి చెప్పిన మాటలు బహుశా రేవంత్ ను ఉద్దేశించే అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. బాహుబలి రేంజిలో రేవంత్ కాంగ్రెస్ అనే మాహిష్మతి లోకి ప్రవేశించి.. పరిస్థితుల్ని చక్కదిద్ది.. పాలనలోకి తీసుకురావాలన్నమాట.
అయితే రేవంత్ కు సునాయాసంగా రాహుల్ అపాయింట్ మెంట్ దొరకడం, దానికంటె మించి.. ఆయనకు పార్టీలో ఇతర సీనియర్ల కంటె అగ్ర ప్రాధాన్యం, అగ్రశ్రేణి పదవులు దక్కుతాయనే ప్రామిస్ కూడా ఏకంగా రాహుల్ నుంచే లభించడం.. ఇలాంటి పరిణామాలన్నీ.. తెరవెనుక చక్రం తిప్పడంలో కీలక నాయకుడు జైపాల్ రెడ్డి పుణ్యమే అనే వాదన వినిపిస్తోంది. జైపాల్... స్వయానా రేవంత్ కు మామ అవుతారు. ఇదివరలో ఇద్దరి మధ్య బంధుత్వాన్ని మించిన అభిప్రాయభేదాలు ఉండేవనే ప్రచారం జరిగేది. కానీ.. ప్రస్తుత పరిణామాల్లో విన్-విన్ సిద్ధాంతాన్ని అనుసరించి ఉభయులకు లాభం జరగాలంటే.. రేవంత్ ను కాంగ్రెస్ లోకి కీలక హోదాలోకే తెచ్చేలా జైపాల్ పావులు కదిపారట.
ఆ రీతిగా కాంగ్రెస్ లోని ఇద్దరు జె-క్యాంప్ లీడర్స్ జానా, జైపాల్ ల మద్దతు ఆయనకున్నదని.. ఇక రేవంత్ కు పెద్దగా ఇతరులనుంచి చికాకులు ఉండకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.