హైదరాబాదీయులకు ధర్నా చౌక్ అంటే సుపరిచితం. ఇలాంటిదే ఢిల్లీలోనూ ఒకటి ఉంది. అదే జంతర్ మంతర్. ఇక్కడ నిత్యం పలువురు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు నిర్వహిస్తుంటారు. రెగ్యులర్ గా ఇక్కడే జరిగే నిరసనలకు భిన్నమైన నిరసన ఒకటి అక్కడి వారందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
దాదాపు 45 ఏళ్ల మహిళ ఒకరు చేస్తున్న దీక్ష.. భిన్నమైనదిగా చెప్పాలి. రాజస్థాన్ లోని జైపూర్‌కు చెందిన జయశాంతి అనే మహిళ.. తనను ప్రధాని మోడీ పెళ్లి చేసుకోవాలంటూ దీక్షను చేస్తున్నారు. ఇలా ఒకటి.. రెండు రోజులుగా కాదు ఏకంగా 30 రోజులుగా ఆమె నిరసన దీక్ష చేస్తున్నారు. తాను ప్రధాని మోడీని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని.. తనను మోడీ అర్థం చేసుకుంటారని ఆమె వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ఇంతకీ.. జయశాంతి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది వెళితే..
జైపూర్‌కు చెందిన ఆమెకు 1989లో పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత ఏడాదిన్నరకే ఆమె భర్త ఎక్కడికో వెళ్లిపోయారు. అతడి వివరాలు బయటకు రాలేదు. ఇదిలా ఉండగా.. ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోవటానికి చాలామందే ముందుకు వచ్చారు. కానీ.. ఆమె మాత్రం అందుకు ససేమిరా అంటూ ఒంటరిగా ఉంటున్నారు.
ఏమైందో ఏమో కానీ.. ఉన్నట్లుండి ఆమెకు ప్రధాని మోడీని పెళ్లాడాలని అననుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే.. ఆమె ఢిల్లీకి వచ్చిన ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. తనను మోడీ పెళ్లి చేసుకుంటానని చెబితే తనకున్న ఆస్తులు.. నగలు అమ్మి రూ.2కోట్లు కట్నంగా ఇస్తానని చెబుతోంది. ఒకవేళ.. తనను ధర్నా చౌక్ నుంచి బయటకు పంపితే.. తాను ప్రధాని ఇంటి దగ్గరే ధర్నా చేస్తానని తేల్చి చెబుతోంది. మిగిలిన విషయాల్ని పక్కన పెడితే.. ధర్నాచౌక్ దగ్గరి రెగ్యులర్ దీక్షలకు భిన్నంగా ఈ దీక్ష అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.