ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కీలక పాత్రను పోషించిన కాంగ్రెస్ పెద్దలు ఎందరో ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకరికి వీరు హీరోలుగా - మరొకరికి విలన్లుగా కనిపించడం సహజం. కానీ అన్ని ప్రాంతాల వారికి విలన్ గా కనిపించగలిగే తెలివితేటలతో - విభజన సమయంలో రెండు ప్రాంతాల నాయకుల పట్ల చాలా అవమాన కరంగా ప్రవర్తిస్తూ , అహంకార మదం తలకెక్కిన నాయకుడు జైరాం రమేష్ అనేది జనంలో ఉన్న అభిప్రాయం.
అలాంటి జైరాం రమేష్.. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను విషపూరితమైన చిరునవ్వులు చిందిస్తూ నిలువునా చీల్చేయడం మాత్రమే కాదు. ఆ సందర్భంగా జరిగిన పరిణామాలను పుస్తకాలుగా అమ్మి సొమ్ము చేసుకోవడానికి ఇప్పుడు జైరాం రమేష్ వెంపర్లాడుతున్నాడు.
'ఓల్డ్ హిస్టరీ న్యూ జియోగ్రఫీ' అనే పేరుతో విభజన అంశాల మీద జైరాం రమేష్ పుస్తకం రాశాడు. ఆ మధ్య హైదరాబాదులో ఓ కార్యక్రమంలో దాన్ని ఆవిష్కరించాడు. తానే పూనుకోకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని అక్కడ డబ్బా కొట్టుకున్నాడు - మళ్లీ ఇప్పుడు విశాఖలో అదే పుస్తకం అమ్ముకోడానికి ప్రమోషన్ కార్యక్రమం పెట్టుకుని.. అక్కడ చేరి కేసీఆర్ ను తిడుతూ.. అలాగైనా పుస్తకాలు అమ్ముకోవచ్చునని ఆశిస్తున్నట్లుగా ఉన్నాడని జనం ఈసడించుకుంటున్నారు.
వైఎస్సార్ మరణించడం వల్లనే కేసీఆర్ కు లైఫ్ వచ్చిందని, అప్పటిదాకా మనుగడ లేని టీఆర్ ఎస్ కు జీవం వచ్చిందని - రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన దీక్ష కూడా నకిలీ దీక్ష అని కొత్త విమర్శలు విశాఖలో చేశారు. అయినా ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణ నేతల్ని తిట్టడం ద్వారా లబ్ధి పొందాలనుకోడం, తెలంగాణలో ఉన్నప్పుడు తామే రాష్ట్రం ఇచ్చాం అనడం.. ఇలాంటి వంకర బుద్ధులను నాయకులు ఎప్పుడు మానుకుంటారో కదా.. అని జనం అసహ్యించుకుంటున్నారు.