అగ్రవర్ణ రిజర్వేషన్లు.. బీసీల పోరుబాట

Update: 2019-01-09 12:25 GMT
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం.. సభలో ఆమోదం పొందుతుండడంపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ బిల్లును చెల్లదని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని తాజాగా ప్రకటించాయి.ఈ మేరకు అఖిల భారత ఓబీసీ సమాఖ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య హాజరై మాట్లాడారు. ఈబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో పేర్కొనలేదని స్పష్టం చేశారు. అగ్రవర్ణాలకు 4శాతం ఉన్న రిజర్వేషన్ 10శాతం పెంచడం చట్టవిరుద్దమన్నారు. 56శాతం దేశంలో ఉన్న బీసీలకు తక్కువ రిజర్వేషన్లు ఉన్నాయని వారికి పెంచాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలపై ప్రేమతో బీసీల పొట్ట కొట్టవద్దని సూచించారు.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడంపై ఈనెల 10న పార్లమెంట్ ముట్టిడిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస గౌడ్ హెచ్చరించారు. 20 రాష్ట్రాల నుంచి బీసీలు తరలి రావాలని కోరారు. ఈబీసీ సాకుతో కేంద్రం అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం చట్టవిరుద్ధమన్నారు. 56శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా.. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాలున్నాయని.. కేంద్రం ఓట్ల కోసమే బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.




Full View
Tags:    

Similar News