రాజకీయాల్లో రాణించాలంటే అంగబలం....అర్ధబలం...డబ్బుతో పాటు కొద్దో గొప్పో వాగ్ధాటి ఉండాలి. కొంతమంది రాజకీయ నాయకులైతే ఆ లక్షణాల్లో మిగతావి కొద్దిగా అటూఇటుగా ఉన్నా....తమ వాగ్ధాటితో నెట్టుకొస్తుంటారు. పదుల కొద్దీ వాడీవేడీ ప్రసంగాలతో ప్రజలకు కనికట్టు కట్టే నేతలూ ఉన్నారు. అయితే, ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే - వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్ మాత్రం....ఒకే ఒక్క డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ పాపులర్ అయ్యారు. ఒకే ఒక్క చాన్స్ అంటూ సినిమా చాన్స్ కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోలాగా....బికామ్ లో ఫిజిక్స్ అన్న ఒకే ఒక్క డైలాగ్ తో జలీల్ ఖాన్ ఓవర్ నైట్ పాపులర్ అయిపోయారు. అయితే, ఆ డైలాగ్ అన్న తర్వాత కూడా....సారు తీరు మారలేదు. కొద్ది రోజుల క్రితం....రంజాన్ పర్వ దినం సందర్భంగా...అల్లాను...బెజవాడ కనకదుర్గమ్మను కలిపి దీవించేశారు బీకామ్ లో ఫిజిక్స్ ఎమ్మెల్యే గారు. ఇక తాజాగా, మరోసారి తన అజ్ఞానం పరాకాష్టకు చేరేలా మాట్లాడి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తండ్రిని చేసేశారు జలీల్ ఖాన్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎమ్మెల్యే జలీల్ ఖాన్.... మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు. గుంటూరులో టిడిపి నిర్వహించిన ‘నారా హమారా – టిడిపి హమారా’ కార్యక్రమంలో పాల్గొన్న జలీల్ తన విజ్ఞానాన్ని మరోసారి ప్రదర్శించి నవ్వులు పూయించారు. ముస్లింలకు కాంగ్రెస్ ఒరగబెట్టిందేమీ లేదంటూ....విమర్శించే క్రమంలో వైఎస్ ఫ్యామిలీపై విమర్శలు గుప్పించాలని చూసి భంగపడ్డారు. “రాజశేఖర్ రెడ్డి మరియు వాళ్ళ నాన్న జగన్ మోహన్ రెడ్డి”లు కూడా ముస్లింలకు చేసిందేం లేదంటూ విమర్శించి అభాసు పాలయ్యారు. హరికృష్ణ అకాల మరణంతో రెండు రోజుల నుంచి ఈ వీడియో వెలుగులోకి రాలేదు. తాజాగా ఇది సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో జలీల్ ఖాన్....నెటిజన్లకు మరోసారి చేతినిండా పనిచెప్పారు. జలీల్ పై సెటైర్లు వేస్తూ నెటిజన్లు కామెడీగా.....కామెంట్స్ పెడుతున్నారు. ఈ రకంగా ఎవరికి ఎవరు ఏమవుతారో మరచిపోయేలా జగన్ కు భయపడుతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా మాట్లాడడం బహుశా జలీల్ ఖాన్ కే సాధ్యం అని అంటున్నారు. బ్రహ్మానందం లేని లోటును జలీల్ ఖాన్ తీరుస్తున్నారని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా తీరు మార్చుకోకుంటే పొలిటికల్ కమెడియన్ గా మిగిలిపోతారని ఎద్దేవా చేస్తున్నారు.
Full View