జ‌ల్సా కింగ్ః 3 వేల కార్లు.. ఒక విమానం.. ఇంకా

Update: 2021-06-15 09:30 GMT
కొంద‌రు పుట్ట‌డ‌మే గోల్డెన్ స్పూన్ తో జ‌న్మిస్తారు. వ‌జ్రపు సింహాస‌నంపై కూర్చుంటారు.. ప్లాటిన‌మ్ బెడ్ పై ప‌డుకుంటారు. అలాంటి వ్య‌క్తి గురించే మ‌నం మాట్లాడుకోబోతున్నాం. ఆయ‌నే.. మ‌హ‌ద్ బిన్ హ్దాన్ అల్ న‌హ్యాన్‌. పేరు పెద్ద‌గా ఉన్న‌ట్టే ఇత‌ని జీవన‌శైలి కూడా అత్యంత భారీగా ఉంటుంది. అవును మ‌రి.. ఈయ‌న సాధార‌ణ పౌరుడు కాదు. అబుదాబి రాజు, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ మొద‌టి అధ్య‌క్షుడి కుమారుడు.

విలాస‌వంత‌మైన జీవితం చాలా మంది గ‌డుపుతుంటారు. కానీ.. అందులోనూ తేడాలుంటాయి. పై స్థాయి.. ఆ పై స్థాయి.. అటు పై స్థాయి.. అంటూ రేంజ్ లు ఉంటాయి. వీట‌న్నింటిని లెక్క‌లోకి తీసుకుంటే.. బుర్జ్ ఖ‌లీఫా అంత ఎత్తులో ఉంటుంది ఈయ‌న ల‌గ్జ‌రీ. ఆయ‌న విలాసాన్ని కొల‌వ‌డానికి ఒక్క ఉదాహ‌ర‌ణ కావాలంటే.. ఆయ‌న కార్ గ్యారేజీ గురించి చెప్పుకుంటే స‌రిపోతుంది.

ఎవ‌రి కార్ గ్యారేలోనైనా ప‌ది కార్లు ఉండొచ్చు.. యాభై కూడా ఉండొచ్చు.. కాదంటే సెంచ‌రీ కొట్టొచ్చు. కానీ.. ఈ షేక్ గ్యారేజీలో.. ఏకంగా 3 వేల పైనే కార్లు ఉన్నాయి. దీన్ని బ‌ట్టి ఈయ‌న ఎంత‌టి విలాస పురుషుడో అర్థం చేసుకోవ‌చ్చు. సొంతంగా విమానం కూడా ఉంద‌నుకోండి.. అది వేరే విష‌యం.

ప్ర‌పంచంలోనే అత్యంత విలాస‌వంత‌మైన కారు నుంచి.. దాదాపు పేరెన్నిక‌గ‌న్న ప్ర‌తీ మోడ‌ల్ ఈయ‌న వ‌ద్ద ఉంటుంది. మెర్సిడిజ్ బెంజ్ ఏ-క్లాస్‌ కార్లు ఏడింటిని ఒకేసారి కొని, ఇంద్ర‌ధ‌నసుల్లోని ఏడు రంగుల‌ను ఆ కార్లకు వేయించాడు. ఆ విధంగా రెయిన్ బోను నేల‌కు దించిన ఈ షేక్ ను అంద‌రూ.. ‘రెయిన్ బో షేక్‌’ అని పిలుస్తుంటారు. ప్రపంచంలో అతి పెద్దదైన జీప్ కూడా ఉంది. సాధార‌ణ జీపు క‌న్నా.. అది 65 రెట్లు పెద్ద‌ది. ఆ జీపు టైరు మ‌నిషిక‌న్నా రెండింత‌ల ఎత్తులో ఉంటుంది. ఇక‌, ఈయ‌న ఆస్తులు.. అంత‌స్తుల‌కు లెక్క‌లేదు. ఈ విధంగా స‌క‌ల భోగ‌భాగ్యాల‌తో జీవితాన్ని అలా న‌డిపించేస్తున్నాడు  మ‌హ‌ద్ బిన్ హ్దాన్ అల్ న‌హ్యాన్‌.
Tags:    

Similar News