అధికార, ప్రతిపక్ష పార్టీతో సంబంధం లేకుండా `సీనియర్ నేత` అనే గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు - ప్రతిపక్ష నేత కె జానారెడ్డి తీరు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు ఆత్మీయ అభినందన సభలో జానారెడ్డి ప్రత్యక్షం అవడం కాంగ్రెస్ పార్టీ నేతలను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది. విపక్షాలు బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు ప్రత్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు వచ్చే నెల 5న జరగనున్నాయి. ఆయనకు బీజేపీ నేతలు అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు అధికార పార్టీ తరఫున కేటీఆర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. సభకు జానారెడ్డి హాజరుకావడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా విపక్షాల ఉప రాష్ట్రపతి ప్రత్యర్థిగా ఉన్న వెంకయ్యపై జానారెడ్డి ప్రశంసలు కురిపించి సొంత పార్టీలో అలజడి రేపారు. జానా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 'వెంకయ్య ఇప్పుడు బీజేపీ - దాని మిత్రపక్షాల అభ్యర్థి మాత్రమే, ఇంకా ఉప రాష్ట్రపతి కాలేదు' అంటూ చెబుతున్నారు. ఈ వ్యవహరంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. గతంలో కూడా జానా ఇటువంటి వ్యాఖ్యలు చేసి పలు విమర్శలకు గురయ్యారు. కాగా, జానారెడ్డి తీరుపై మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``పార్టీలో ఉంటావా? లేక బయటికి పోతావా? తేల్చుకోవాలి. పార్టీలో ఉంటూనే ఈ విధంగా వ్యవహరించడం సరైందికాదు. ప్రత్యర్థి పార్టీ సభకు వెళ్లడం బాధ కలిగించింది`` అని అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకి అయిన వెంకయ్యపై జానారెడ్డి ప్రశంసలు కురిపించడాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి తప్పుపట్టారు. వెంకయ్య పెద్ద అవినీతి పరుడని, ఇటువంటి నేతను సమర్ధించడం సరైందికాదన్నారు. జానారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నట్టు కాంగ్రెస్ సేవాదళ్ చైర్మెన్ - మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దనరెడ్డి అన్నారు. వెంకయ్యను అభినందించడం అభ్యంతరకరమన్నారు. బీజేపీ టీఆర్ ఎస్ లపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు - నాయకులు పోరాటం చేస్తుంటే.. ఆ పార్టీ నాయకులను ఆయన ప్రశంసించడం ఎంత వరకు సమంజసమన్నారు. మొత్తంగా వెంకయ్య సభకు వెళ్లి జానారెడ్డి ఇచ్చిన ట్విస్ట్ వెనుక మర్మం ఏమిటనేది కాంగ్రెస్ నేతలను ఆలోచనలో పడేసింది.