తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత జానారెడ్డి సంచలన సవాల్ చేశారు. తనదైన శైలిలో దూసుకెళుతున్న కేసీఆర్ కు ఆయన విసిరిన సవాలు ఆసక్తికర రాజకీయాలకు తెర తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. సంప్రదాయ రాజకీయ వాదిగా తనను తాను చెప్పుకునే జానారెడ్డి తాజాగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు.
నల్గొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన జానారెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులు ఒక పంటకు నీరు ఇచ్చేందుకు డిజైన్ చేసినవని చెప్పిన ఆయన.. పనిలో పనిగా రెండో సవాలు విసిరారు. తెలంగాణ ప్రభుత్వం కానీ రైతులకు రెండు పంటలకు నీరు అందించిన పక్షంలో తాను టీఆర్ ఎస్ పార్టీకి ప్రచార కార్యకర్తగా పని చేస్తానని చెప్పారు. జానాసాబ్ లాంటి సీనియర్ నేత నోటి నుంచి వచ్చిన సవాళ్లపై సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.