టీఆర్ ఎస్ కు భారీ ఆఫర్ ఇచ్చిన జానారెడ్డి

Update: 2016-07-04 04:53 GMT
తెలంగాణ అధికారపక్షానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రినని పదే పదే చెప్పుకునే జానారెడ్డి.. ముఖ్యమంత్రి పదవిని వదిలేసి.. తెలంగాణ అధికారపక్షానికి కార్యకర్తగా మారతానని చెబుతున్నారు.అయితే.. అందుకు ఆయన రెండు అంశాల్ని కండీషన్ గా పెడుతున్నారు. తాను చెప్పిన రెండు అంశాల్ని తెలంగాణ అధికారపక్షం కానీ పూర్తి చేసిన పక్షంలో తాను టీఆర్ ఎస్ కు కార్యకర్తగా మారతానని తేల్చి చెబుతున్నారు.

నాగార్జున సాగర్ భూములకు రెండో పంటకు నీళ్లు ఇవ్వటం.. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను అమలు చేసిన పక్షంలో తాను కాంగ్రెస్ పార్టీని వదిలేస్తానని.. తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి కార్యకర్తగా మారి.. ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని వ్యాఖ్యానించారు. సాధ్యం కాని అంశాలపై కాలయాపన చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడిన జానా.. తాము మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తమను అప్రతిష్ఠపాలు చేయాలనే కుట్ర వారు చేస్తున్న విమర్శల్లో ఉందంటున్నారు.సీఎం స్థాయి వ్యక్తి ఇచ్చిన తాజా ఆఫర్ పై తెలంగాణ అధికారపక్షం ఎలా రియాక్ట్ అవుతుందో..? చూస్తుంటే.. జానా భవిష్యత్ అంతా.. కేసీఆర్ పని తీరు మీద ఉన్నట్లుగా కనిపించట్లేదు?
Tags:    

Similar News