జానారెడ్డికి నిద్ర పట్టడం లేదట?

Update: 2017-10-30 05:29 GMT

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు జానారెడ్డికి నిద్ర పట్టనివ్వడం లేదట. ఎలాగైనా సీఎం కావాలని కోరుకుంటున్న ఆయనకు పార్టీలోని నేతల నుంచే పోటీ తీవ్రంగా ఉంది. ఇదంతా కాంగ్రెస్ గెలిచినప్పటి మాటలైనా కూడా ముందు ఆలోచనల్లో మాత్రం కాంగ్రెస్ నేతలు ఎవరూ తగ్గడం లేదు. ఇప్పుడు ఉన్న ఆశావహులు చాలరన్నట్లుగా కొత్తగా టీడీపీ నుంచి రేవంత్ ఒకరు వచ్చి చేరుతున్నారు. ఏ పార్టీలో ఉన్నామన్న విషయంతో సంబంధం లేకుండా అసలు రేవంత్ లక్ష్యమే సీఎం పోస్టు. ఆయన దూకుడు - పోరాటాలు - వ్యూహాలు అన్నీ ఆ దిశగానే ఉంటాయి. ఇప్పడు కాంగ్రెస్ లోకి వచ్చినా ఆయన లక్ష్యమేమీ మారదు. పైగా పార్టీ పెద్దలు కూడా రేవంత్ పై భారీ ఆశలు పెట్టుకున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగి కాంగ్రెస్ ను రేవంత్ అధికారంలోకి తేగలిగితే ఆయన్నే సీఎం చేసినా చేయొచ్చు.
    
ఈ విషయం పెద్దలు జానారెడ్డికి కూడా ఇప్పటికే అర్థమైందని, అందుకే ఆయన రేవంత్ చేరికపై గుర్రుగా ఉన్నారని టాక్. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారిని నయానో భయానో నచ్చచెప్పొచ్చని, కానీ, రేవంత్ మాట వినే రకం కాదని, ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా తనను సీఎం సీటు వరకు రేవంత్ రానివ్వడని జానా టెన్షన్ పడుతున్నారట.
    
పైగా జానాపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఏమంత సంతృప్తిగా లేదు. ఆయన తెలిసో తెలియకో... కేసీఆర్ సహా టీఆరెస్ నేతలు తెలివిగా కట్టబెడ్తున్న పెద్దరికానికి పడిపోయి గులాబీ పార్టీని ఢీకొట్టలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సొంత పార్టీకే నష్టం కలిగేలా ఆయన వ్యవహరించిన సందర్భాలున్నాయి. ఈ విషయం మిగతా నేతలు ఇప్పటికే అధిష్ఠానం వరకు తీసుకెళ్లారు. దీంతో ఇప్పటికే జానాకు ప్రయారిటీ తగ్గించారన్నది బహిరంగ రహస్యం. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ లాంటి చిరుత పార్టీలోకి వస్తే తనలాంటి సీనియర్లకు కష్టమేనని ఆయన టెన్షన్ పడుతున్నారట.
Tags:    

Similar News