శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కత్తి మహేష్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా కత్తి మహేష్ పై సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా ఆరోపణలు గుప్పించారు. సమాజ సామరస్యానికి భంగం కలిగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన జానారెడ్డి.. కత్తి మహేష్ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడడం క్షమించరానిదన్నారు. ఇలాంటి విషయాల్లో జర్నలిస్టులు సంయమనం పాటించాలని.. అసహ్యమైన మాటలు ప్రచురించకూడదన్నారు. సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు.
అనంతరం జానారెడ్డి ప్రభుత్వ విధానాలపై కూడా స్పందించారు. రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం ఎందుకు పెట్టిందో వివరణ ఇవ్వాలని కోరారు. రైతులకు పెట్టుబడి సహాయం కోసమే పథకం అయితే ఫర్వాలేదని.. కానీ పథకం లక్ష్యం నెరవేరడం లేదని అన్నారు. రైతుబంధును స్వాగతిస్తున్నామని.. నిజమైన సాగుదార్లకు న్యాయం చేయాలని కోరారు.