తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. సీనియర్ రాజకీయ నేతగా.. ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలుగా అర్హత ఉన్నప్పటికీ సీఎం కాలేని వ్యక్తిగా ఆయన్ను రాజకీయ వర్గాలు అభివర్ణిస్తుంటాయి. అంతటి అనుభవం ఉన్న నేత అయినప్పటికీ తరచూ తప్పులు చేయటం జానాకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ చాణుక్యం ఎలా ఉంటుందో? ఆయన ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందన్న విషయం తెలిసినా.. అప్పుడప్పుడు కేసీఆర్ సర్కారు తీరును పొగిడేసి సొంత పార్టీని ట్రబుల్స్ లో పడేయటం జానాకు అలవాటే.
తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కే జానా మాట్లాడుతున్నారంటే చాలు.. సొంత పార్టీ నేతలు సైతం కంగారు పడుతుంటారు. ఏ నిమిషాన ఏ మాట ఆయన నోటి నుంచి వస్తుందోనన్న భయం వారిలో కనిపిస్తుంది. సొంత పార్టీ నేతల మీద టార్గెట్ చేసేందుకు వెనుకాడని జానా కారణంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. తాజాగా అలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జానారెడ్డి. నల్గొండలో జరిగిన రైతు రణభేరీలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు సంధించారు.
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడటంతో కేసీఆర్ పాత్ర ఏమాత్రం లేదన్న ఆయన.. తాజాగా తెలంగాణకు కేసీఆర్ చేస్తున్నది ఏమీ లేదని తేల్చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.1.5లక్షలు చొప్పు పరిహారం వెంటనే ఇస్తామని.. ఇప్పుడు కేసీఆర్ సర్కారు రూ.6లక్షలు ఇస్తామని చెబుతున్నా.. ఒక్క రైతు కుటుంబానికి కూడా ఆ పరిహారం అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చటంలో కేసీఆర్ సర్కారు విఫలమైందన్న ఆయన.. రుణమాఫీని ప్రస్తావించారు. మరిన్ని తప్పులు చేస్తున్న కేసీఆర్ ను తిట్టేస్తున్న జానా.. అప్పుడప్పుడు ఆయన్ను.. ఆయన సర్కారును పొగిడేయటం ఎందుకో..?