ఇన్ స్టాలో కీలక పరిణామం... వీరేంద్ర సెహ్వాగ్ జంట విడిపోనుందా..?
భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్, అతని భార్య ఆర్తీ ఆహ్లావత్ తమ 20 ఏళ్ల వివాహ బంధానికి స్వస్థి పలకనున్నారనే ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారింది.
టీమిండియా మాజీ క్రికెటర్, డేరింగ్ & డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట తీవ్ర సంచలనంగా మారింది. ఇందులో భాగంగా... సెహ్వాగ్ తన భార్య ఆర్తీ ఆహ్లావత్ తో విడిపోతున్నారా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దీనికి కారణం.. ఇన్ స్టాగ్రామ్ లో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం అని అంటున్నారు.
అవును... భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్, అతని భార్య ఆర్తీ ఆహ్లావత్ తమ 20 ఏళ్ల వివాహ బంధానికి స్వస్థి పలకనున్నారనే ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సమయంలో... వీరిద్దరూ చాలా నెలలుగా విడివిడిగానే జీవిస్తున్నారని.. త్వరలో విడాకులు తీసుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయని అంటున్నారు. దీంతో.. ఈ విషయం వైరల్ గా మారింది.
కాగా... వీరేంద్ర సెహ్వాగ్ - ఆర్తీ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరిలో ఆర్యవీర్.. 2007లో జన్మించగా.. 2010లో వేదాంత్ జన్మించారు. ఈ క్రమంలో సుమారు 20 ఏళ్లుగా వివాహ జీవితంలో ఉన్న వారి మధ్య ఇటీవల పరిణామాలు పెరుగుతున్న దూరాన్ని సూచిస్తున్నాయని తెలుస్తోంది. ఇందులో ఇన్ స్టా లో అన్ ఫాలో ఒకటి!
ఇటీవల ఇన్ స్టా గ్రామ్ లో ఈ జంట ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో వీరి రిలేషన్ షిప్ స్టేటస్ పై ఊహాగానాలు వచ్చాయి. ఇదే క్రమంలో... దీపావళి వేడుకల సందర్భంగా సెహ్వాగ్ పంచుకున్న ఫోటోల్లో... సెహ్వాగ్ తన కుమారులు, తల్లితో ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారే కానీ.. ఆర్తీతో ఉన్న పిక్స్ ఎక్కడా కనిపించలేదు.
ఇక.. ఇటీవల పాలక్కాడ్ లోని విశ్వనాగయక్షి ఆలయాన్ని సందర్శించిన పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాలో పంచుకున్నారు. అందులోనూ ఆర్తి గురించిన ప్రస్థావన లేదు. దీంతో.. వీరిద్దరి మధ్యా గ్యాప్ వచ్చేసిందని.. త్వరలో వీరు విడిపోబోతున్నారనే చర్చ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ విషయంపై వీరేంద్రుడు కానీ.. ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ దీనిపై స్పందన వస్తుందా.. లేక, ఇలానే సోషల్ మీడియాలో ఊహాగాణాలు, ప్రచారాలతోనే కొంతకాలం నడుస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా.. వీరేంద్రుడికి సంబంధించిన ఈ విషయం మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.