తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు ధర్మవరపు శ్రీనివాస్ తర్వాత గులాబీ రంగు పులుముకునే కాంగ్రెస్ నేతల్లో మరో సీనియర్ నేత జానారెడ్డి ముందువరుసలో నిల్చున్నారా? విభజనానంతరం గత 16 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిని పల్లెత్తు మాట అనకుండా పరోక్షంగా సమర్థిస్తూ వచ్చిన జానారెడ్డి అటు అధిష్టానంతోనూ, ఇటు టీపీసీసీతోనూ కయ్యం పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అధిష్టానం సాగనంపడమో లేదా తనంత తానుగా మాతృసంస్థను వీడిపోవడమో.. ఈ రెండింటిలో ఏది జరిగినా తన మంచికే అని జానారెడ్డి భావిస్తున్నారా?
తాను నిఖార్సయిన కాంగ్రెస్ వాదినని, తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, ఎవరి సర్టిఫికెట్టూ తనకు అవసరం లేదని పదే పదే స్పష్టం చేస్తున్న జానారెడ్డి ఇటీవలి కాలంలో చోటా మోటా నేతలు కూడా తనను నిలదీస్తున్న పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారు. అసెంబ్లీలో తెరాస ప్రభుత్వానికి సైలెంటుగా మద్దతు ఇవ్వడంలో ఆరితేరిపోయిన ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ చేపడుతున్న ఏ కార్యక్రమంలోనూ తనకు తానుగా ముందుకు రాకుండా వెనుకవరుసలో ఉండిపోతున్నారు.
ఆయన వ్యవహారానికి పరాకాష్ట శనివారం జరిగిన తెలంగాణ బంద్. రైతు ఆత్మహత్యలను నిరసిస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కలిసికట్టుగా తెలంగాణ బంద్‌కి పిలుపివ్వగా జానారెడ్డి చల్లగా జారుకున్నారు. అనారోగ్యం కారణంగా తాను బంద్‌లో పాల్గొనలేదని సమర్థించుకున్న జానారెడ్డి అరెస్టయిన పార్టీ నేతలను పరామర్శించడానికి హైద్రాబాద్ లోని గోషామహల్ చేరుకోగా ఆయన్ని కాంగ్రెస్ నేతలా నిలదీశారు.
ఇప్పటికే జానారెడ్డి కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనమైపోతుందనీ, ఆయన కాంగ్రెస్ నేతలా కాకుండా, కోవర్టులా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తూ మండిపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి ఇక పార్టీలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అంచనాకు వచ్చేశారు. అధికార పార్టీకి ఆయన నిస్సిగ్గుగా వత్తాసు పలుకుతుండటంతో నేతల్లో ఆత్మస్థయిర్యం దెబ్బతినడమే కాంగ్రెస్ నుంచి టీఆరెస్ లోకి వలసలు పెరగడానికి కారణమవుతోందని అధిష్టానానికి సమాచారం చేరవేశారు.
కొంత కాలం కిందట జానారెడ్డి పార్టీ మారడం గురించి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా.. నేరుగా ఆయనతోనే కొన్ని సెటైర్లు వేసినట్లుగా ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ మారుతున్నారా సార్.. అంటే.. అలాంటిదేమీ లేదని.. జానారెడ్డి తడుముకుంటూ రాహుల్ కు జవాబు చెప్పాల్సి వచ్చిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి.
తీరా చూస్తుంటే స్వచ్చందంగానో లేదా కాంగ్రెస్ పార్టీతో గెంటించుకునో తెరాసలోకి గెంతేసేందుకు జానారెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు అభిప్రాయానికి వచ్చేశారు. ఇక ముహూర్తం ఎప్పుడు అన్నదే తరువాయి కాబోలు.