సీఎల్పీ నేత కె జానారెడ్డి తీరుపై ఎట్టకేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. జానా ప్రకటనతో ముందుగా ఒకరకమైన ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ...అనంతరం వారు ఊపిరి పీల్చుకున్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శాసనసభ కమిటీ హాలులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సీఎల్ పీ భేటీ అయింది. సీఎల్పీ నేత కె జానారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రెండు గంటల పాటు జరిగింది. 20కి పైగా అంశాలపై చర్చించి సభలో ఎలా వ్యవహరించాలనే విషయమై కసరత్తు చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీయడంలో తానే ముందుంటానని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ సభ్యుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.
శాసనసభ సమావేశాలను నిర్వహించాలనే ఉద్దేశ్యం అధికార పార్టీకి లేదనీ.., కాబట్టి, రెచ్చగొడితే రెచ్చిపోరాదని సమావేశంలో తీర్మానించింది. ప్రభుత్వ హామీలు - సమస్యల అమలు - పరిష్కారం తదితర అంశాలతో పాటు అవిశ్వాస తీర్మానం అనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. సమావేశాల్లో ఎజెండాను బుల్ డోజ్ చేయ డానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇతర ప్రతిపక్షాలను చర్చించి అవసరమైతే అవిశ్వాసానికి వెళదామని కాంగ్రెస్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. అవిశ్వాసం అనే అంశంపై సమావేశంలో బిన్నాభిప్రాయాలు వచ్చాయి. మెజారిటీ లేకుండా అవిశ్వానికి వెళితే వచ్చే ప్రయోజనాలు, నష్టాలను గూర్చి చర్చించారు. ఇప్పుడే ఆ అంశంపై చర్చ వద్దని జానారెడ్డి వారించారు. ఈ సందర్భంగానే ఆసక్తికరమైన చర్చ జరిగింది.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా జానారెడ్డి మౌనంగా ఉండడం సరికాదనీ, దానివల్ల ఆయనకు చెడ్డపేరు వస్తోందనీ.., అది ఆయనకూ….పార్టీకి కూడా మంచిది కాదని, స్పీడ్ పెంచాలని కొందరు ఎమ్మెల్యేలు అనడంతో జానారెడ్డి అవాక్కయ్యారు. "నేను పెద్దమనిషిగా సంయమనం పాటిస్తున్నాను. అధికార పార్టీపై విమర్శలు చేయలేక కాదు. నా పంథా మీకు తెలుసు కదా? సభలో అత్యంత సీనియర్ ను - సుదీర్ఘ అనుభవం ఉన్నవాడిగా ఏ అంశంపైనైనా మాట్లాడగలను. సహచర సభ్యులుగా మీరు కూడా అపార్థం చేసుకోరాదు. ప్రధాన అంశాలపై తానే ముందు మాట్లాడుతాను" అని తోటి ఎమ్మెల్యేకు జానారెడ్డి భరోసా ఇవ్వడంతో ఒక్కసారిగా అందరు సంతోషం వ్యక్తం చేసి అభినందించారు.
కాగా..శాసనసభ సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని , అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శించాలని సిఎల్‌పి నిర్ణయించింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అంది వచ్చే ఏ ఒక్క అంశాన్ని జారవిడుచు కోరాదనీ, సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల కష్టాలు, కన్నీళ్లు, కడగళ్లను వినిపించే ప్రయత్నం చేయనుంది. అందుకు అవసరమైన సమాచారంతో రావాలని సభ్యులను ఆదేశించింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న విషయం అధికార పక్షానికి తెలుసుననీ, మంత్రులు సైతం ప్రైవేట్ సమావేశాల్లో అంగీకరిస్తున్నారని, కాబట్టి రెచ్చగొట్టి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసుకోవాలనే ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రయత్నించాలనిఏకాభిప్రాయానికి వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/