అసెంబ్లీలో జనసేన తొలి పలుకు ఇదే..

Update: 2019-06-14 06:36 GMT
ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీనే కాదు.. జనసేన ఉనికి కూడా ఉంది. ఈ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన తరుఫున ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ గెలిచారు. ఈయన ఏపీ అసెంబ్లీలో ఒకే ఒక్కడుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. జనసేన కండువాను ధరించి టీడీపీ, వైసీపీ మధ్యలో ప్రత్యేకంగా కనిపించారు.

తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అధినేతలు జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే అనూహ్యంగా మైక్ నందుకున్న జనసేన అభ్యర్థి రాపోలు ఆనందభాస్కర్ ఆసక్తికరంగా మాట్లాడారు..

జనసేన సిద్ధాంతాలను ప్రతిబింబించేలా మాటలతో రాపోలు ఆకట్టుకున్నారు. పాలక పక్షం, ప్రతిపక్షం కానీ అసెంబ్లీలో మాటల యుద్ధం చేయాల్సిన అవసరం లేదని.. ప్రజా సమస్యలపై యుద్ధం చేయాలని.. ప్రజాసమస్యలపై పరిష్కారం కోసం అర్థవంతమైన చర్చ జరగాలని కోరారు.

కాగా జనసేన అభ్యర్థి అసెంబ్లీలో తొలి పలుకులోనే టీడీపీ, వైసీపీలకు చురకలంటించడం.. ప్రజాసమస్యలపై వాణి వినిపించడంతో జనసైనికులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన వాయిస్ ను వినేవాళ్లం. కానీ ఈసారి రెండు చోట్ల పోటీచేసిన ఆయన ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి రాపోల్ మాత్రమే గెలిచి జనసేన ఉనికిని అసెంబ్లీలో చాటుతున్నారు.


Tags:    

Similar News