జ‌న‌సేన‌.. టీడీపీ టెంట్ హౌస్ పార్టీ: పేర్ని నాని స‌టైర్లు

Update: 2023-05-12 18:47 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కాపు నేత‌, వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌నసేన పార్టీ టీడీపీకి టెంట్ హౌస్ పార్టీఅని స‌టైర్లు వేశారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన సైనికులు.. అన్నీ వ‌దుల‌కుని ప‌వ‌న్ కోసం తిరుగుతున్నార‌ని.. కానీ, దానిని వారు మానుకుని త‌ల్లిదండ్రులు చూపిన బాట‌లో న‌డ‌వాల‌ని పేర్ని విన్న‌వించారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి గురువారం ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌పై ఆయ‌న కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

2014లో జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ప్పుడే ఆయ‌న‌కు బ‌లం లేద‌ని తెలుసని పేర్ని వ్యాఖ్యానించారు. అయితే.. ఇప్పుడు కొత్త‌గా తెలిసి వ‌చ్చిన‌ట్టుగా వ్యాఖ్యానిస్తున్నాడ‌ని అన్నారు. అప్ప‌ట్లో బ‌లం లేకే పోటీకి దూరంగా చెప్పిన ప‌వ‌న్‌.. 2019లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఉండేందుకు.. క‌మ్యూనిస్టులు, బీఎస్పీ వంటి పార్టీల‌ను అడ్డుపెట్టుకుని పోటీ చేయ‌లేదా?  ఇదంతా ఎవ‌రికోసం చేశారు? అని నిల‌దీశారు. అప్ప‌ట్లోనూ వైసీపీకి ఓట్లు ప‌డ‌కుండా ఉండాల‌నే ఉద్దేశంతోనే ప‌వ‌న్ ఇలా చేశాడ‌ని అన్నారు. ''చంద్రబాబు అవసరాలకు పెట్టిన టెంట్ హౌస్ పార్టీ జనసేన” అని పేర్నినాని ఎద్దేవా చేశారు.

"నా బాధంతా ఒక్కటే. పవన్ కల్యాణ్ ని నమ్ముకుని సాఫ్ట్ వేర్ జాబులు సైతం వదులుకుని, పవన్ ని సీఎంని చేయాలని కంకణం కట్టుకుని ఊర్లు తిరుగుతున్నారు జన సైనికులు. వారు త్యాగాలను మానుకుని కన్న తల్లిదండ్రుల ఆశలు తీర్చాలని కోరుతున్నా. ఓట్ల కోసమే రాజకీయాలు చేయడం పవన కళ్యాణ్ కి చెల్లింది.

ఒకప్పుడు సంవత్సరానికి 100 కోట్లు వదులుకొని రాజకీయాలు చేస్తున్నా అన్నాడు. మరి ఇప్పుడు  టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు వస్తాడు. వారాహి అంటూ.. ఏదో వాహనంతో హడావుడి చేసి ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే బయటకు తీస్తా అంటున్నాడు " అని పేర్ని వ్యాఖ్యానించారు.

ప‌వ‌న్ పాలేరు:  జోగి ర‌మేష్‌ మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబుకు పాలేరు అని వ్యాఖ్యానించారు. పదేళ్లుగా జెండాలు మోసిన జనసైనికులు ఆత్మరక్షణలో పడ్డారని తెలిపారు. పవన్‌ ప్యాకేజీ స్టార్‌ తప్ప పాలకుడు కాదని మేం చెబుతూనే ఉన్నామ‌న్నారు.

పవన్‌ పూజకు పనికిరాని పువ్వు లాంటి వ్యక్తి అని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. పాలకుడిని కాదు.. పాలేరునని పవన్‌ ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ జనసేన నేతల పేరుతో టీడీపీ వారే పోటీ చేస్తారని చెప్పారు. జనసైనికులు కూడా పాలేరులుగా మారకుండా నిర్ణయం తీసుకోవాలని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Similar News