ఊసు లేని జ‌న‌సేన‌.. మ‌ళ్లీ మామూలేనా..!

Update: 2023-03-30 14:04 GMT
జ‌న‌సేన దూకుడు మ‌ళ్లీ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. య‌థాప్ర‌కారం.. జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌న్‌.. రంగంలో ఉంటేనే.. ఆ పార్టీ లో జోష్ క‌నిపిస్తోంద‌నే వాద‌న బ‌లంగా ఉంది.

నిజానికి గ‌త నెల రోజుల కింద‌ట మంగ‌ళ‌గిరిలో బీసీల సంక్షేమం.. కాపు సంక్షేమం పేరుతో స‌భ‌లు నిర్వ‌హించి.. కొన్ని దిశానిర్దేశాలు చేసిన ప‌వ‌న్‌.. ఇప్పుడు మ‌ళ్లీ ఐపు లేకుండా పోయారు. ఆయ‌న ఎక్క‌డున్నారో కూడా క‌నిపించ‌డం లేదు.

ఇది పార్టీలోనే కాకుండా... ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా చ‌ర్చ‌కు దారితీస్తోంది. అస‌లు ప‌వ‌న్ ఉద్దేశం ఏంట‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. నిజానికి గ‌త నెల‌లో స‌భ‌లు పెట్టిన త‌ర్వాత‌.. కాపులు చైత‌న్యం కావాల‌ని దిశానిర్దేశం చేసిన త‌ర్వాత‌.. కొంత ఊపు క‌నిపించింది. కాపులు కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. వారిలో త‌ప్పులు స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఇంత‌లోనే మ‌ళ్లీ ప‌వ‌న్ క‌నిపించ‌కుండా పోయారు.

ఇది పార్టీకే కాకుండా.. వ్య‌క్తిగ‌తంగా కూడా ప‌వ‌న్‌పై మ‌చ్చ‌ప‌డేలా చేస్తోంద‌న్న‌ది కాపు నాయ‌కులే చెబుతున్న మాట‌. ఇదిలావుంటే.. వ‌చ్చే రెండు రోజుల్లో కాపులు స‌మావేశం ఏర్పాటు చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యంపై కీల‌క నేత‌లు.. దీనిలో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. మ‌రి ఇలాంటి స‌మ‌యంంలో అయినా.. ప‌వ‌న్‌యాక్టివ్ అయి..వారిని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తారా?   లేదా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

దీనికి తోడు.. టీడీపీ దూకుడు పెరిగింది. అదేస‌మ‌యంలో వైసీపీ గ్రాఫ్ కూడా ప‌డిపోతోంది. ఇక‌, బీజేపీ మ‌రింత మైన‌స్ అయిపోయింది. ఇలాంటి సంధికాలంలో పార్టీ ప‌రంగా పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేసేందుకు  మేజ‌ర్ స్కోప్ ఉన్న‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ స్పందించ‌క‌పోవ‌డం.. ఏపీ ప‌రిణామాల‌పై ఆయ‌న మాట్లాడ‌క పోవ‌డం వంటివి ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Similar News