పంచాయతీ ఎన్నికల్లో జనసేన మంచి ఫలితాలు సాధించడంతో ఆ పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. 'పంచ్ డైలాగులు' పేల్చి పవన్ కళ్యాణ్ పార్టీ సాధించిందని అన్నారు.'ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క' అని గబ్బర్ సింగ్ డైలాగ్ పేల్చారు.
తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో వదిలారు. సినిమా స్టైల్ లో డైలాగ్ లు చెప్తూ.. ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అనే తంబ్ నెయిల్ కూడా పెట్టేశారు నాగబాబు. పంచాయితీ ఎన్నికల్లో జనసేన 18-26 శాతం ఓట్లు సాధించి 200-400 వరకూ పంచాయితీలు సాధించిందని అంటున్నారు. రెండు వందలకు నాలుగు వందలకు మధ్య తేడా రెండొందలు ఉండగా.. నాగబాబు చెప్పిన లెక్కలు ఇంకా గందరగోళానికి గురిచేస్తున్నాయి.
జనసేన ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని.. ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం అని నాగబాబు అన్నారు. పవన్ చెప్పినా.. వేరే ఎవ్వరు చెప్పినా జెన్యూన్ పర్సన్ కి ఓటు వేయాలనే ఆలోచనతో ప్రజలు జనసేనను గెలిపించారని నాగబాబు అన్నారు.
ఖచ్చితంగా చెప్తున్నా.. మార్పు మొదలైంది.. ఈ మార్పు ఇక్కడితో ఆగదు' అంటూ నాగబాబు కుండబద్దలు కొట్టాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాలను ఎన్నుకోవడం కాదు.. రాజకీయమే పవన్ కళ్యాణ్‌ని ఎన్నుకుంది. ప్రజలకు మంచి పాలన అందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నేచర్ కూడా నమ్మినట్టు ఉంది అందుకే కళ్యాణ్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు.
కొన్నిసార్లు చాలామంది రాజకీయాలను ఎన్నుకుంటారు.. కానీ కళ్యాణ్ బాబు రాజకీయమే పవన్ కళ్యాణ్‌ని ఎన్నుకుంది. ఇలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని రాజకీయం కోరుకుందని నాగబాబు అన్నారు. . జన్యూన్‌గా ఉండే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని భావిస్తున్నారు. ఈ నమ్మకం కోసం పవన్ కళ్యాణ్ చాలా ఓర్పుతో చూస్తున్నాడు.. కళ్యాణ్ బాబుకి కావాల్సింది ప్రజలు పట్టం కట్టడం కాదు.. ప్రజలకు ఏదైనా చేయాలని నాగబాబు అన్నారు. ఏపీలో వైసీపీ తరువాత అత్యధిక స్థానాలు సాధించింది జనసేన మాత్రమేనని స్పష్టం చేశారు.