టీడీపీ జనసేన పొత్తు... హీటెక్కించే డిస్కషన్...?

Update: 2022-03-16 16:30 GMT
ఏపీలో రాజకీయ వేడిని రగిలించిన ఘనత అచ్చంగా  జనసేనాని పవన్ కళ్యాణ్ దే. ఆయన ఒకే ఒక సభ పెట్టారు. గంటన్నర పాటు మాట్లాడారు. ఇక లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని చివర్లో ఆయన పొత్తుల మీద కోటి డౌట్లు పెడుతూ వదిలిన డైలాగులులతో  ఏపీ పాలిటిక్స్ ఒక్కలెక్కన ఉయ్యాల  ఊగుతోంది.

నిజంగా టీడీపీ జనసేనకు మధ్య పొత్తు ఉంటుందా అన్నదే ఆ చర్చ. పవన్ మాటల అర్ధం ఏమై ఉంటుంది. పరమార్ధం ఏంటి అన్నదాని మీద అన్ని రాజకీయ పార్టీలు బుర్రలకు పని చెబుతున్నాయి. ఇక అధికార వైసీపీలో కూడా దీని మీద హాట్ హాట్ గానే చర్చ సాగుతోందని టాక్.

ఒక వైపు అసెంబ్లీ జరుగుతూంటే లాబీల్లో వైసీపీ ఎమ్మెల్యేలు దీని మీదనే ముచ్చట్లు పెట్టడం విశెషం అంటున్నారు. ఏపీలో టీడీపీ జనసేన కలిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం. ఓటు బ్యాంక్ ఎవరికి చిల్లు పడుతుంది. వైసీపీకి దీని వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి ఇలా సాగుతున్నాయట చర్చలు.

ఇక ఉభయ  గోదావరి ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు అయితే గత ఎన్నికల ఓట్లు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసిన చోట వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ కూడా లెక్కలు కట్టుకునే పనిలో బిజీగా ఉన్నారట.  మొత్తానికి చూస్తే ఎవరిమటుకు వారు పైకి ధీమానే ఉన్నారట.

వైసీపీకి జనాదరణ ఉంది. ఒంటరిగానే పోటీ చేస్తాం, ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైసీపీదే విజయం అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నా లోపల మాత్రం కలవరంగానే ఉంది అంటున్నారు. మొత్తానికి టీడీపీ జనసేన పొత్తు అంటే 2014 రిజల్ట్స్ మాత్రం వైసీపీకి గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. ఇపుడు వచ్చేది 2024. ఇందులో కూడా చివరిన నాలుగు ఉంది. సో ఈ నంబర్ సెంటిమెంట్ ఏం చేస్తుంది అన్నదే చర్చట.
Tags:    

Similar News