జనసేన కూడా ఏకగ్రీవంగా గెలిచేసింది..!

Update: 2020-03-17 11:28 GMT
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ - టీడీపీ ఆటలో అరటిపండుగా మారి చిత్తుగా ఓడిపోయిన జనసేన పార్టీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో విచిత్రంగా నాలుగు స్థానాల్లో ఏకగ్రీవంగా గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆపసోపాలు పడుతున్న ఈ తరుణంలో జనసేన అభ్యర్థులు నలుగురు ఏకగ్రీవం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నాలుగు ఎంపీటీసీల్లో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గెలిచిన రాజోలులో ఓ మహిళ ఎంపీటీసీగా గెలిపొందింది. వైసీపీకి జైకొట్టిన రాపాక ఇలాకాలో జనసేన సత్తా చాటడం విశేషం.

ఇక జనసేన తరుఫున గెలిచిన  మిగతా మూడు స్థానాలు గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో భూలక్ష్మీ - పశ్చిమ గోదావరి జిల్లా వేడంగిలో వెంకటనరసింహారావు - తూర్పు గోదావరి జిల్లా కడియపులంక3లో విజయనిర్మలలు ఏకగ్రీవంగా గెలిచారు.

జనసేన తరుఫున ఏకగ్రీవంగా గెలిచిన వారిని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ప్రత్యేకంగా అభినందిచడం విశేషం. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి చాటుతుందా అని కంగారు పడిన వారికి జనసేన నాలుగు స్థానాల్లో ఏకగ్రీవంగా గెలవడం ఆశ్చర్యమే మరీ.
Tags:    

Similar News