జ‌క్కంపూడికి జ‌న‌సేన సెగ ఇందుకేనా?

Update: 2022-07-26 11:30 GMT
తూర్పుగోదావ‌రి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు జ‌న‌సేన శ్రేణుల సెగ త‌గిలింది. గోదావ‌రి వ‌ర‌ద బాధిత ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌డానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జూలై 26న మంగ‌ళ‌వారం కోన‌సీమ జిల్లాకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో పి.గ‌న్న‌వ‌రం మండ‌లం గంటి పెద‌పూడి గ్రామం వ‌చ్చిన జ‌క్కంపూడి రాజాను జ‌న‌సేన శ్రేణులు, జ‌న‌సేన పార్టీ వీర మ‌హిళ‌లు అడ్డుకున్నారు. ఆయ‌న వాహ‌న శ్రేణికి అడ్డుగా రోడ్డుపైన నిల్చున్నారు.

సీఎం డౌన్ డౌన్ అంటూ జ‌నసేన కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో రాజా వారిని వారించ‌బోయార‌ని అంటున్నారు. అయితే వారు రాజాను ఉద్దేశించి ఏక‌వ‌చ‌నం ప్ర‌యోగించ‌డంతో రాజా వారిపైన సీరియ‌స్ అయ్యార‌ని చెబుతున్నారు.

జ‌నసేన పార్టీ కార్య‌క‌ర్త‌లే అతి చేశార‌ని.. జ‌క్కంపూడి రాజా ముందు వారితో న‌వ్వుతూనే మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించార‌ని అంటున్నారు. ఆగ‌మ్మా.. ఏంటి మీ స‌మ‌స్య‌లు అని రాజా అడ‌గ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని చెబుతున్నారు.

అయితే జన‌సేన మ‌హిళ ఎమ్మెల్యే వెళ్లిపోతాడేమో అని అంటే.. యాడ‌కి వెళ్లాడు.. వీడు.. వెళ్ల‌డు వీడు అంటూ రాజాను ఉద్దేశించి ఏక‌వ‌చ‌నాన్ని ప్ర‌యోగించార‌ని.. దీంతో రాజా వారిపై సీరియ‌స్ అయ్యాడ‌ని పేర్కొంటున్నారు. అయితే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అరుస్తుండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నార‌ని అంటున్నారు.

మ‌రోవైపు జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు మాత్రం వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం గురించి ప్ర‌శ్నిస్తే ఎమ్మెల్యే రాజా త‌మ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడ‌ని అంటున్నారు. ఆయ‌న అనుచ‌రులు త‌మ‌ను బూతులు తిట్టార‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Tags:    

Similar News