జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీలో చేస్తున్న రాజకీయాలపై వివాదాలు, విమర్శలు ఎలా ఉన్నా.. చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఆయనకో వ్యూహం లేదని.. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో తెలియదని.. కొన్నాళ్లుగా మేధావులు కూడా అంటున్నా రు. ఇదిలావుంటే.. ఇప్పుడు పవన్ చేస్తున్న యాత్రలపైనా చర్చ సాగుతోంది. ఏ నాయకుడైనా ప్రజలకు కనెక్ట్ కావలంటే.. అంతో ఇంతో నిరంతరం వారి మధ్య ఉండాలి. వారి సమస్యలపై మాట్లాడాలి. వారిలో భరోసా నింపాలి. ఈ మూడు అంశాలు బాగుంటే.. ఇక, ఆ నేతలకు తిరుగు ఉండదు. అయితే.. పవన్ విషయాన్ని తీసుకుంటే.. ప్రజల సమస్యలపై గళం విప్పుతున్నారు.
కానీ, ప్రజల మధ్య మాత్రం ఆయన ఉండడం లేదని అంటున్నారు పరిశీలకులు. వచ్చి పోవడం.. కుదిరినప్పుడు.. ప్రెస్‌మీట్లు పెట్టడం.. కీలకమైన అంశాల్లోనూ ప్రెస్ నోట్లు విడుదల చేయడం.. వంటివాటికే ఆయన పరిమితం అవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
ఇలాంటి వాటి వల్ల.. ఆయన అభిమానులకు, పార్టీ నాయకులకు కనెక్ట్ అవుతారే తప్ప సాధారణ ఓటరుకు కనెక్ట్ కావడం కష్టమేనని చెబుతున్నారు. ఇలా కనెక్ట్ కానంత వరకు పవన్ రాజకీయాలు అనుకున్న తీరం చేరడం కష్టమేనని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పవన్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర కూడా ఇలానే ఉందని పెదవి విరుస్తున్నారు.
గత ఏప్రిల్‌లో మొదలు పెట్టిన కౌలు రౌతు భరోసా యాత్ర.. సాగనా.. వద్దా.. అన్నట్టుగా ముందుకు సాగుతోందని మేధావులు చెబుతున్నారు. రైతులను పవన్ పరామర్శిస్తున్నారు. కానీ, ఒకే విడతలో ఒకటి రెండు నెలలు .. ప్రజల మధ్యే ఉండి.. ఇలాంటి పనులు చేయడం వల్ల మంచి పేరు.. పవన్ తమకోసం.. ఏదో చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతాయని అంటున్నారు.
అలా కాకుండా.. ఎప్పుడో నెలకోసారి వచ్చి.. పరామర్శించడం వల్ల.. అనుకున్న విధంగా.. ఆశించినట్టు మైలేజీ వచ్చే ఛాన్స్ లేదని.. ఈలోగా.. సాయం అందుకున్న వారు.. కూడా మరిచిపోతున్నారనేది మేధావుల మాట.
చేయాలనుకున్న సాయం అయినా.. మేలైనా.. ఒకే సారి చేస్తే.. అది కొన్నాళ్లపాటు చ ర్చలో ఉంటుందని.. అలా కాకుండా.. విడతల వారీగా వెళ్లి.. సాయం చేస్తే.. ఎవరికి మాత్రం గుర్తుండిపోతుందనేది మేధావుల ప్రశ్న. అదేసమయంలో సర్కారు నుంచి ఎదురవుతున్న సమస్యలపై కూడా నిర్దిష్టమైన పోరాటం ఎంచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఏదో గాలి వాటంగా వచ్చి.. సభలు పెట్టినంత మాత్రాన, అవి హిట్టయినంత మాత్రాన .. ఓటు బ్యాంకుగా మారే అవకాశం తక్కువేనని చెబుతున్నారు. మరి పవన్ ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.