జ‌న‌సేన ప‌వ‌న్ మాట‌లు న‌మ్మేదెలా... !

Update: 2022-05-09 10:30 GMT
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాలు.. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై.. మేధావులు చెబుతున్న మాట ఇదే!! ''ఆయ‌న మాట‌లు న‌మ్మేదెలా?!'' అంటున్నారు. ప‌వ‌న్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో .. తెలియ‌క‌, ఆయ‌న ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారో.. అర్ధం కాక‌.. కేడ‌ర్ కూడా ఇబ్బందులు ప‌డుతోంద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము ఒంట‌రిగానే ముందుకు వెళ్తామ‌ని ప్ర‌క‌టించారు.

కానీ, అనూహ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నిర్ణ‌యం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. గ‌త నెల‌లో నిర్వ‌హించిన పార్టీ ఆవిర్భావ స‌ద‌స్సులో.. పొత్తుల‌కు సానుకూలంగా ఉన్న‌మంటూ.. సంకేతాలు ఇచ్చారు.

ఇప్ప‌టికే బీజేపీతో ఉన్న పొత్తు విష‌యం అంద‌రికీ తెలిసిందేన‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ పొత్తులేంట ని.. పార్టీ నేత‌లు విస్తుపోయారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌నిచ్చేది లేద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. అంటే ఆయ‌న మ‌రోపార్టీతోపొత్తుకు సిద్ధ‌మ‌య్యార‌నే సంకేతాలు ఇచ్చారు.

ఇక‌, మ‌ళ్లీ అదే నోటితో.. తాము ఎవ‌రి ప‌ల్ల‌కీలు మోసేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అంటే.. ఇలా..తిక‌మ‌క కామెంట్ల‌తో పార్టీ నేత‌ల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నార‌నేది పార్టీ నేత‌ల ప్ర‌శ్న‌.

అంతేకాదు.. మ‌రో రెండేళ్లే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంద‌ని.. అలాంట‌ప్పుడు.. పార్టీ నేత‌ల‌ను ఇలా గంద‌ర‌గోళానికి గురి చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఫ‌లితం వ‌స్తుంద‌ని.. వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా స‌మ‌యం వృథా అయిపోయింద‌ని.. క్షేత్ర‌స్థాయిలో పార్టీకి కేడ‌ర్ కానీ, కీల‌క నేత‌లు కానీ.. లేర‌ని సీనియ‌ర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అంతేకాదు..ఒక‌ప్పుడు.. మేధావి వ‌ర్గం గా ఉన్న మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు జ‌న‌సేన‌పై అప్పుడ‌ప్పుడైనా చ‌ర్చ‌లు చేసేవార‌ని.. కానీ, ఇప్పుడు ఎవ‌రూ మాట్లాడ‌డం లేద‌ని.. ఎవ‌రూ కూడా పార్టీ గురించి మాట్లాడ‌డం లేద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే రోజుల్లో అయినా.. పార్టీకి స‌రైన దిశానిర్దేశం చేయాల్సిన అవ‌స‌ప‌రం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News