ఏపీ రాజకీయాల్లో పవన్ కీలకం అవుతారా అయితే ఏ స్థాయిలో ఆయన ప్రభావం ఉంటుంది, ఇక పవన్ కింగ్ అవుతారా. లేక తాను కింగ్ మేకర్ గా ఉంటారా. ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే. ఇక పవన్ తరచూ కొన్ని విషయాలు మీడియాకు చెబుతున్నారు. వాటిని జాగ్రత్తగా క్రోడీకరించి అన్వయించుకుంటే కచ్చితంగా పవన్ మొదట కింగ్ మేకర్ గా మారి అక్కడ నుంచి కింగ్ గా మారుతారు అనే అర్ధం అవుతుంది.
తాజాగా మంగళగిరిలో మీడియాతో పవన్ మాట్లాడుతూ తాను పాదయాత్ర చేయడం మీద మాట్లాడారు. పాదయాత్ర చేస్తేనే సీఎం అవుతారా. ఆ మాటకు వస్తే రీసెంట్ గా మహారాష్ట్ర సీఎం అయిన ఏక్ నాధ్ షిండే సంగతేంటి అని ప్రశ్నించారు. అలాగే నితీష్ కుమార్ ఏ పాదయాత్ర చేశారు అని కూడా లాజిక్ పాయింట్ తీశారు. ఇక్కడ పవన్ నితీష్ కుమార్ ఏక్ నాధ్ షిండేలనే ఎందుకు ఉదహరించారు అన్నదే చర్చకు వచ్చే విషయం.
ఈ ఇద్దరు సీఎంలకు చాలా సారూప్యత ఉంది. ముందుగా నితీష్ కుమార్ గురించి మాట్లాడుకుంటే ఆయన సొంత పార్టీ జేడీయూకు ఏనాడూ బీహార్ అసెంబ్లీలో పూర్తి మెజారిటీ రాలేదు. పైగా ఆయన ఎపుడూ టోటల్ సీట్లకు పోటీ చేసినదీలేదు. ఆయన కూటములతోనే ఎన్నికలకు వెళ్లారు. ఫలితాలు వచ్చిన తరువాత తనకు తక్కువ సీట్లు వచ్చినా కూడా దర్జాగా సీఎం సీటే ఎక్కారు. ఇది ఒకసారి కాదు అనేకసార్లు జరిగింది.
2020 ఎన్నికల్లో బీజేపీకి 76 సీట్లు జేడీయూకు 46 సీట్లు వచ్చినా నితీషే సీఎం అయ్యారు. ఇక లేటెస్ట్ గా ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో కూటమి కట్టారు. ఆర్జేడీకి 80 దాకా సీట్లు ఉన్నాయి. నితీష్ కి తక్కువ సీట్లే అయినా సీఎం అయిపోయారు. అదే పవన్ లాజిక్ తో మాట్లాడుతున్న మాటగా ఇక్కడ అర్ధం చేసుకోవాలి.
మరో వైపు చూస్తే మహారాష్ట్రలో ఏక్ నాధ్ షిండే కూడా ఇంతే. ఆయన శివసేన నుంచి ఒక నలభై మంది దాకా ఎమ్మెల్యేలను చీల్చారు. బీజేపీకి 120 దాకా బలం ఉంది. అయినా మూడవ వంతు బలం ఉన్న షిండేకే సీఎం సీటు ఇచ్చారు. ఆయనకే పగ్గాలు అప్పగించి నీవే రాజుని అని బీజేపీ వారు గౌరవించారు. అందుకే ఈ ఇద్దరు సీఎంలను పవన్ ఎంతో ఆలోచించే ప్రస్థావనకు తెచ్చారు.
ఇక వీరికంటే ముందు కర్నాటకలో కుమారస్వామిని కూడా 2019 ఎన్నికల వేళ పవన్ తలచుకునే వారు. ఆయన కధ ఇదే. కేవలం 38 సీట్లతో కర్నాటక సీఎం అయిపోయారు. ఆయన్ని ఒకసారి కాంగ్రెస్ చేస్తే మరోసారి బీజేపీ చేసింది. ఇక్కడ కూడా కుమారస్వామి పార్టీకి ఏ రోజునా పూర్తి మెజారిటీ రాలేదు అన్నది గుర్తుంచుకోవాలి.
ఏపీ రాజకీయాల్లో కూడా మూడవ పక్షంగా తాను ముందుకు వస్తే కచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ జరిగి ఏ పార్టీకి మెజారిటీ రాని హంగ్ వస్తే సీఎం సీటు తనదే అన్న ఆలోచన ఏదో పవన్ కి ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే మా రాజకీయ వ్యూహాలు మాకు ఉన్నాయి అని పవన్ ఈ మధ్య తరచూ అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ బయటకు తనకు కులాలు లేవు అని అంటున్నా తన సామాజికవర్గాన్ని ఏకీకృతం చేసే పనిని సక్సెస్ ఫుల్ గానే చేసారు అని అంటున్నారు. అందుకే గోదావరి జిల్లాలు టోటల్ గా పవన్ ఫీవర్ తో ఊగిపోతున్నాయి. పవన్ ప్రభావం విశాఖ సహా క్రిష్ణా, గుంటూరులలో కూడాబాగానే ఉంటుందని అంటున్నారు.
పవన్ జనసేన ఒంటరిగా పోటీ చేసినా పొత్తులతో వచ్చినా కనీసంగా నలభై సీట్లు తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా అర్ధమవుతోంది. ఆ సీట్లు కనుక జనసేనకు వస్తే కచ్చితంగా ఏపీలో హంగ్ ఏర్పడినట్లే. అపుడు వైసీపీ ఎటూ పవన్ని సపోర్ట్ చేయకపోవచ్చు కానీ టీడీపీ ఎక్కువ సీట్లు సాధించినా కూడా పవన్ కి మద్దతు ఇచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టే చాన్స్ నూరు శాతం ఉంది.
అందుకే పవన్ చాలా నిబ్బరంగా మాట్లాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే పవన్ స్ట్రాటజీ అదుర్స్ అన్నట్లుగానే సాగుతోంది. మొదట కింగ్ మేకర్ ఆ మీదట కింగ్ కావడమే ఆ స్ట్రాటజీ. ఏపీలో వచ్చేది జనసేన సర్కారే అని కాపు నాయకులు కూడా చెబుతున్నారు అంటే ఈ వ్యూహం పక్కాగా బలమైన సామాజికవర్గంలో దిగువ స్థాయికి కూడా చేరింది అంటున్నారు. అందుకే ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా జనసేనకు ఓట్లేసి ఈసారి పవన్ని సీఎం గా చూడాలని గోదావరి జిల్లాలు ఉప్పొంగుతున్నాయి.