పవన్ ‘ఉద్యమ పాటలు’ వచ్చేశాయ్

Update: 2017-01-24 10:07 GMT
వరుస ట్వీట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగామరిన్ని ట్వీట్లు చేసేశారు. ఆర్కే బీచ్ లో నిర్వహించే మౌనదీక్షకు దన్నుగా నిలిచేలాఒక మ్యూజిక్ అల్బంను విడుదల చేస్తున్న విషయాన్ని పవన్ గతంలోనే చెప్పారు.తాజాగా.. ఆయన తన ఆరుపాటలున్న ఈ అల్బంను ఈ రోజు విడుదలచేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం ఆరుపాటలున్న ఈ అల్బంను ఒక పాట తర్వాతమరొకటి చొప్పున.. ప్రతి 45 నిమిషాలకు ఒకటి చొప్పున విడుదల చేస్తాననివెల్లడించారు.

అందుకు తగ్గట్లే తన తొలిపాటకు సంబంధించిన యూట్యూబ్ లింక్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. తన సినిమాలోని ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ను రీమిక్స్ చేశారు. పాటమధ్యలో వచ్చే మ్యూజిక్ లో.. ఇటీవల కాలంలో తాను నిర్వహించిన బహిరంగసభల్లో చేసిన పవన్ ఫుల్ నినాదాల్ని అందులో ఉంచారు. ‘‘ఏ దేశం ఏగినాఎందుకాలిడిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. పొగడరా నీ జాతి నిండుగౌరవాన్ని’’ అన్న వ్యాఖ్యతో పాటు.. ఢిల్లీ పాలకుల నిర్లక్ష్యంపై ఎలుగెత్తి.. ఢిల్లీవీధులకు వినిపించేలా భారత్ మాతాకీ జై అని నినాదం చేద్దామని పిలుపునిచ్చేనినాదాల్ని సందర్భానుసారంగా పాటలో మిక్స్ చేశారు.

తొలి పాట తర్వాత చెప్పిన టైంకు ఒక్కొక్క పాటను ట్విట్టర్ ద్వారా యూట్యూబ్లింకు ఇస్తూ విడుదల చేశారు. ఇక.. పవన్ విడుదల చేసిన మిగిలిన ఐదు పాటల్నిచూస్తే..  జానీ చిత్రంలోని.. ‘నారాజు గాకురమా అన్నయ్య’ పాటను రీమిక్స్చేశారు. మూడో పాటగా.. ఖుషీలోని ‘యే మేరా జహా’ పాటను.. నాలుగో పాటగా..గుడుంబా శంకర్ లోని.. ‘‘లే లే లే ఇవాళే నువ్ లే’’ పాటల్ని విడుదల చేశారు. ఈసందర్భంగా ఒరిజినల్ గా ఆ పాటల్ని కంపోజ్ చేసిన చిత్ర దర్శకుల్ని.. పాటలరచయితలకు క్రెడిట్ ఇచ్చేసి పవన్.. ‘‘లే లే లే’’ పాటకు వెనకున్న కారణాన్నివెల్లడించారు. శ్రీలక్ష్మి అనే విద్యార్థినిని.. అందరి ముందు దారుణంగా చంపేసినమనోహర్ ఉదంతం నేపథ్యంలో రాయించినట్లుగా చెప్పుకొచ్చారు.

ఈ ఆల్బంను తయారు చేసిన డీజే పృథ్వీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 19 ఏళ్ల పృథ్వీ సాయి ఆసియాలోనే అత్యంత పిన్నవయస్కుడైన డీజేగా పవన్చెప్పారు. తన పదేళ్ల వయసులోనే డీజేగా అవతారమెత్తిన అతడే.. తాజాఅల్బంను రూపొందించినట్లుగా చెప్పాడు. మరిక ఆలస్యం ఏందుకు.. ఆ పాటల్నివినేస్తే పోలా..


Tags:    

Similar News