మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ పాస్‌ పోర్ట్ దేశం ఏదో తెలుసా?

Update: 2018-10-11 04:48 GMT
ఏదైనా దేశం వెళ్లాలంటే పాస్‌ పోర్ట్ ఒక్క‌టే అస్స‌లు స‌రిపోదు. వీసా త‌ప్ప‌నిస‌రి. కానీ.. వీసా అవ‌స‌రం లేకుండా ఏ దేశానికైనా వెళ్లిపోయి.. అరైవ‌ల్ వీసాను పొందే సౌల‌భ్యం అంత ఈజీ కాదు. భార‌త‌దేశం విష‌యానికే వ‌స్తే.. పాస్‌ పోర్ట్ చేతిలో ప‌ట్టుకొని విమానం టికెట్ కొనేసి రివ్వున ఎగిరే సౌల‌భ్యం కేవ‌లం 59 దేశాల‌కు మాత్ర‌మే వెళ్లొచ్చు.

ఇదే తీరులో ప్ర‌పంచంలో అత్యంత ప‌వ‌ర్ ఫుల్ పాస్‌ పోర్ట్ ఏ దేశానిద‌న్న క్వ‌శ్చ‌న్ వేస్తే.. అగ్ర‌రాజ్య‌మైన అమెరికా పేరు చ‌ప్పున గుర్తుకు వ‌స్తుంది. కానీ.. అది వాస్త‌వం కాదు. మ‌రి.. ప‌వ‌ర్ ఫుల్ పాస్‌ పోర్ట్ ఏ దేశానిద‌న్న ప్ర‌శ్న‌కు చాలామంది స‌మాధానం చెప్ప‌లేరు. ఆ మాట‌కు వ‌స్తే.. ఊహ‌కు కూడా అంద‌దు. ఇంత‌కీ అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ దేశం ఏదంటారా?  మ‌న చెంత‌నే ఉన్న బుజ్జి దేశం జ‌పాన్‌.

న‌మ్మ‌శ‌క్యంగా లేకున్నా ఇది నిజం. జ‌పాన్ పాస్‌ పోర్ట్ చేతిలో ఉంటే.. ప్ర‌పంచంలో ఏకంగా 190 దేశాల‌కు ఎలాంటి వీసా ప్రాసెస్ లు లేకుండా వెళ్లిపోయే వీలుంటుంది. ప్ర‌పంచంలో మ‌రే దేశ పాస్‌ పోర్ట్‌ కు లేని స్పెష‌ల్ జ‌పాన్ పాస్‌ పోర్ట్‌ కు మాత్ర‌మే సొంతం. ఇంత‌కాలం 189 దేశాల‌కు ఎలాంటి వీసా అవ‌స‌రం లేకుండా వెళ్లే వీలుంది. తాజాగా మ‌య‌న్మార్ వీసా అవ‌స‌రం లేకుండా జ‌పాన్ పాస్‌ పోర్ట్ ఉంటే త‌మ దేశంలోకి అనుమ‌తిస్తామంటూ నిర్ణ‌యం తీసుకోవ‌టంతో జ‌పాన్ పాస్‌ పోర్ట్ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ గా మారింది.

ప‌వ‌ర్ ఫుల్ పాస్‌ పోర్ట్ విష‌యంలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో జ‌పాన్ నిలిస్తే.. నెంబ‌ర్ టూ స్థానంలో సింగ‌పూర్ 189 దేశాల‌తో నిలిచింది. ఇక‌.. మూడో స్థానంలో ఫ్రాన్స్.. జ‌ర్మ‌ని.. ద‌క్షిణాఫ్రికాలు నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్టులు ఉంటే 188 దేశాల‌కు ఎలాంటి వీసా అవ‌స‌రం లేకుండా వెళ్లే వీలుంది. మ‌రి.. భార‌త్ ర్యాంక్ ఏమంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. గ‌తంలో మ‌న ర్యాంక్ 78 ఉండేది. ఇటీవ‌ల రెండు స్థానాలు పైకి ఎదిగి 76 స్థానంలో ఉన్నాం. మ‌రి.. ప్ర‌పంచానికే పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రించే అమెరికా విష‌యానికి వ‌స్తే.. ఆ దేశ పాస్ పోర్ట్ ఉంటే 186 దేశాలకు నేరుగా వెళ్లే వీలుంది.

ఇక‌.. ర‌వి ఆస్త‌మించిన బ్రిటీష్ సామ్రాజ్యం అన్న పేరును సొంతం చేసుకున్న బ్రిట‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆ దేశ పాస్‌ పోర్ట్ చేతిలో ఉంటే అమెరికా పాస్‌ పోర్ట్ మాదిరే 186 దేశాల్లో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ప‌వ‌ర్ ఫుల్ పాస్‌ పోర్ట్ రేసులో యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ అంత‌కంత‌కూ దూసుకెళుతోంది. 2006లో ఈ దేశం 62వ ర్యాంక్ లో ఉండ‌గా.. తాజాగా ఇప్పుడు 21వ స్థానానికి దూసుకెళ్లింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేష‌న్ డేటా అధారంగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ఆధారంగా ఈ ర్యాంకుల్ని డిసైడ్ చేశారు. వీసా లేకుండా ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి వెళ్లే అవ‌కాశం ప‌వ‌ర్ ఫుల్ పాస్ పోర్ట్ ఇస్తుంది. అది జపాన్ పాస్‌ పోర్ట్‌ కే సొంత‌మ‌న్న మాట విన్న‌ప్పుడు కాసింత ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు.


Tags:    

Similar News