అవును.. మోడీ సతీమణినే. అప్పుడెప్పుడో చిన్నతనంలో పెళ్లి చేసుకోవటం.. తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోవటం తెలిసిందే. ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగే వరకూ తన వ్యక్తిగత జీవితం కూడా ఓపెన్ కాని మోడీ.. తనకు గతంలో పెళ్లి అయ్యిందని.. తాను ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లుగా చెప్పారు. ఎన్నికల అఫిడవిట్లో తన పెళ్లి గురించి వెల్లడించిన మోడీ కారణంగా.. ఆయన సతీమణిగా జసోదాబెన్ సుపరిచితురాలిగా మారిపోయారు.
మోడీ భార్యగా కొందరు గుర్తిస్తూ గౌరవిస్తుంటారు. కానీ.. తన వ్యవహారశైలితో ఆమె దేశ ప్రజల మనసుల్ని దోచుకున్నారు. టీచర్ గా రిటైర్ అయిన ఆమె.. ప్రధానిగా ఉన్న వ్యక్తి చిన్నతనం భార్య అన్న ట్యాగ్ పడినప్పటికీ సాదాసీదాగా వ్యవహరిస్తుంటారు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉండే ఆమె.. తాజాగా జరుగుతున్న గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
పోటాపోటీగా సాగుతున్న గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ.. కాంగ్రెస్ ల మధ్య పోరు నువ్వా..నేనా అన్నట్లుంది. గెలుపుపై ఇప్పుడు కాస్తంత గందరగోళంగా మారింది. ఇలాంటి వేళలో.. రాజకీయాల గురించి మాట్లాడని జసోదాబెన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లలో 130కి పైగా సీట్లను బీజేపీ గెలుస్తుందంటూ జోస్యాన్ని చెప్పారు. బాలికా విద్యా.. మహిళా సాధికారిత అవసరంపై జోసాదాబెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తనకున్న రాజకీయ అవగాహనను వ్యక్తం చేయటమే కాదు.. తిరుగులేని రీతిలో గుజరాత్ లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరి.. ఆమె జోస్యం ఎంత వరకూ కరెక్ట్ అవుతుందన్నది మరికాసిన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.