అమ్మ వేద‌నిల‌యం ఇప్పుడెలా ఉందంటే..

Update: 2017-04-04 00:30 GMT
త‌మిళ‌నాడు రాష్ట్రంలో తిరుగులేని అధినేత్రిగా రాజ‌కీయ చ‌క్రం తిప్పిన అమ్మ జ‌య‌ల‌లిత.. ఊహించ‌నిరీతిలో శెల‌వు తీసుకొని శాశ్విత నిద్ర‌లోకి జారిపోవ‌టం తెలిసిందే. అమ్మ పేరు చెప్పిన వెంట‌నే.. ఆమె నివాసం ఉంటే పోయెస్ గార్డెన్‌లోని వేద‌నిల‌యం చ‌టుక్కున గుర్తుకు వ‌స్తుంది. విశాల‌మైన స్థ‌లంలో అత్యద్భుతంగా నిర్మించిన వేద‌నిల‌యం నిత్య క‌ల్యాణం.. ప‌చ్చ తోర‌ణం మాదిరి ఉండేది. అమ్మ‌ను చూసేందుకు వ‌చ్చే వంద‌లాది మంది అభిమానుల‌తో సంద‌డిగా ఉంటూ.. నిత్యం జ‌య‌.. జ‌య అంటూ జ‌య‌జ‌య‌ధ్వానాల‌తో సంద‌డిగా ఉండే ప‌రిస‌రాలు.. అమ్మ భ‌ద్ర‌త కోసం ఉండే ప్ర‌త్యేక బ‌ల‌గాలు ఒక ఎత్తు అయితే.. ఇక‌.. వేద‌నిల‌యం లోప‌ల ప‌చ్చ‌టి తోర‌ణాల‌తో నిత్యం క‌ళ‌క‌ళ‌లాడ‌ట‌మే కాదు.. మంచి సుగంధం వాస‌న‌తో.. పూజాది కార్య‌క్ర‌మాలు.. ఇంటికి వ‌చ్చిన వారికి అతిధి మ‌ర్యాద‌ల కోసం బిజీబిజీగా ఉండే వంట గ‌ది హ‌డావుడితో సంద‌డి సంద‌డిగా ఉండేది.

అలాంటి వేద‌నిల‌యం.. అమ్మ మ‌ర‌ణం క‌ళ కోల్పోయింది. అయితే.. అమ్మ త‌ర్వాత‌.. ఇంటిని చిన్న‌మ్మ శ‌శిక‌ళ సొంతం చేసుకోవ‌టంతో ఆ హ‌డావుడి ఎంతోకొంత కంటిన్యూ అయ్యింది. అయితే.. ఆక్ర‌మాస్తుల కేసులో దోషిగా తేలి.. జైలుశిక్ష‌కు గురైన చిన్న‌మ్మ ప‌ర‌ప్ప‌న జైలుక త‌ర‌లించ‌టంతో వేద‌నిల‌యం భ‌విత‌వ్యంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీనికి త‌గ్గ‌ట్లే.. ప్ర‌స్తుతం వేద నిల‌యం బోసిపోయింది. రాజ‌సం మొత్తం కోల్పోయి.. దైన్యంతో క‌నిపిస్తున్న తీరు చూస్తే.. మ‌న‌సు క‌లుక్కుమ‌న‌క మాన‌దు.

ఒక‌ప్పుడు ఎంతో సంద‌డిగా.. ఠీవీగా నిలిచిన వేద‌నిల‌యం.. ఈ రోజు లోప‌ల మొత్తం గ‌దుల్ని మూసేయ‌ట‌మే కాదు.. ముందు తలుపుల్ని మూసేసిన వైనం క‌నిపిస్తుంది. ఒక‌ట్రెండు రోజుల‌కు ఒక‌సారి వెళ్లే ఇద్ద‌రు.. ముగ్గురు ప‌ని వాళ్లు లోప‌ల శుభ్రం చేసి రావ‌టం చూసినప్పుడు.. అమ్మ‌తో పాటే.. వేద‌నిల‌యం క‌ళ కూడా పోయింద‌న్న భావ‌న రావ‌టం ఖాయం. వేద‌నిల‌యంతో అనుబంధం ఉన్న వారే కాదు.. ఆ ఇంటి ముచ్చ‌ట్ల‌న త‌ర‌చూ వినే వారంతా.. ఇప్పుడా ఇంటికి ఏర్ప‌డిన దుస్థితి విని అయ్యో అన్న మాట అన‌కుండా ఉండ‌లేక‌పోతున్న ప‌రిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News