వెళ్లిపోయిన అమ్మ వెంట తీసుకెళ్లినవి..

Update: 2016-12-07 06:10 GMT
వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము.. వెళ్లేటప్పుడు ఏమీ తీసుకుపోము అని చెప్పటం తరచూ వింటుంటాం. నిజమే.. పుట్టేటప్పుడు ఎలా అయితే భూమి మీదకు వస్తామన్నది మామూలే అయినా.. వెళ్లేటప్పుడు వెంట ఏమీ తీసుకు వెళ్లకున్నా.. చేసిన పనులు వారిని ఎలా గుర్తుంచుకోవాలే డిసైడ్ చేస్తుంది. తాజాగా ‘అమ్మ’ జయలలిత మరణం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కావాల్సినంత అధికారం.. అంతులేని సంపద.. ఏమైనా చేయించుకోగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ.. మరణం ముందు ఇవేమీ పని చేయవన్నది అక్షర సత్యంగా చెప్పాలి.

వెళ్లేటప్పుడు వెంట ఏమీ తీసుకెళ్లే అవకాశం లేకున్నా.. అమ్మను ఖననం చేసే సమయంలో జయకు ఎంతో ఇష్టమైన వస్తువులతో ఆమెను ఖననం చేయటం గమనార్హం. అమ్మకు ఎంతో ఇష్టమైన ఎర్ర అంచు ఉన్న ఆకుపచ్చ చీరతో పాటు ఆమె నిత్యం కుడి చేతికి ధరించే వాచీ.. చిన్నతనం నుంచి ఎడమ చేతికి పెట్టుకునే గాజును తొడిగారు. ఎప్పుడూ అమ్మ పెట్టుకునే తరహాలో తిలకాన్ని దిద్దారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని.. ప్రేమను సొంతం చేసుకొని.. అందరికి వేదనను మిగులుస్తూ.. అమ్మ తన దారిన తాను వెళ్లిపోయారు. జీవితకాలంలో చేసిన పోరాటాలతో ఆలసిన ఆమె కాయం.. మెరీనా బీచ్ దగ్గర.. ఆమె ఎంతగానో ఆరాధించే ఏంజీఆర్ సమాధి చెంతన శాశ్విత నిద్రలోకి వెళ్లి సేద తీరుతున్నారని చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News