జయలలితది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. దక్షిణాది సినీరంగం అత్యంత విజయవంతమైన హీరోయిన్ మంచి స్టార్ డమ్ లో ఉన్న సమయంలో ఆమె 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఆమె మొదలైన ఆమె రాజకీయ ప్రస్థానం ఇంకా ఎన్నో ఉన్నతులు చూడాల్సిన సమయంలో అనూహ్యంగా అనారోగ్యం కారణంగా ముగిసిపోయింది.
జయ రాజకీయ జీవితం టైమ్ లైన్..
1982- తమిళ సూపర్ స్టార్ ఎం.జి. రామచంద్రన్ స్థాపించిన అఖిలభారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె)లో చేరారు. పార్టీ సదస్సులో తన తొలి రాజకీయ ప్రసంగం చేశారు.
1983- ఏడాది దాటక ముందే పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమితురాలయ్యారు.
1984- ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడడంతో పాటు పలు ఇతర భాషలు కూడా ఆమెకు కొట్టిన పిండి కావడంతో జయ సామర్ధ్యాన్ని గుర్తించిన ఎంజీఆర్ పార్టీ గళం వినిపించేందుకు ఆమెను రాజ్యసభకు పంపించారు.
1989 వరకూ ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. అన్నాడిఎంకెకి ప్రధాన ప్రచారకర్తగా మారారు. ఎంజిఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ ఘన విజయం సాధించడానికి దోహదపడ్డారు. పార్టీలో ఆమె ప్రాధాన్యం పెరగడం సీనియర్ నేతలకు కంటగింపుగా మారింది. ఎంజిఆర్ అనారోగ్యం కారణంగా తాత్కాలిక ముఖ్యమంత్రిగా తన పేరు ప్రకటించేలా చేసుకోడానికి ఆమె ప్రయత్నించారు. అయితే అది ఫలించలేదు.
1986- పార్టీలోని అన్ని పదవులనుంచీ జయలలితను ఎంజిఆర్ తొలగించారు. ఆ తర్వాత ఆమె సమాంతర రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఎఐఎడిఎంకె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు.
1987- ఎంజిఆర్ మృతి తర్వాత ఆయన రాజకీయ వారసులెవరనే విషయమై సందిగ్ధం ఏర్పడింది. పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. పార్టీ మీద నియంత్రణకోసం ఎంజిఆర్ వారసత్వం కోసం ఆయన భార్య జానకితో జయలలిత పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి బాధ్యతల్ని జానకి చేపట్టారు.
1989- శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జయలలిత వర్గానికి 27 సీట్లు - జానకి వర్గానికి రెండు సీట్లు వచ్చాయి. ఎంజీఆర్ వారసత్వాన్ని జయకు అప్పగించి రాజకీయాలనుంచి జానకి తప్పుకున్నారు. జయలలిత తమిళనాడుకు తొలి మహిళా ప్రతిపక్షనేత అయ్యారు. బడ్జెట్ సమావేశాల సమయంలో శాసనసభలో ఆమెపై దాడి జరిగింది. డిఎంకె సీనియర్ నాయకుడొకరు ఆమె చీర లాగడానికి ప్రయత్నించారు. ఆ అవమానంతో ఆమె.. ముఖ్యమంత్రి అయితే తప్ప శాసనసభకు రాబోనని ఆమె ప్రతిజ్ఞ చేశారు.
1991- కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని, రాజీవ్ గాంధీ హత్య అనంతర సానుభూతి పవనాలను ఆసరా చేసుకొని, తమిళనాడు ముఖ్యమంత్రిగా తొలిసారి అధికారం చేపట్టారు.
1991-1996- ఆధిపత్య ధోరణి - పార్టీ క్యాడర్ లో అవినీతి ఆరోపణలు, తన పెంపుడు కొడుకు సుధాకరన్ పెళ్ళిని ఆడంబరంగా నిర్వహించడం లాంటి అంశాలపై ప్రజల్లో ఆమెపై వ్యతిరేకత బాగా పెరిగింది.
1996- శాసనసభ ఎన్నికల్లో అన్నాడిఎంకె చిత్తుగా ఓడిపోయింది. అధికారంలోకి వచ్చిన డిఎంకె ఆమెపై అవినీతి కేసులు పెట్టింది. ఒక అవినీతి కేసులో జయలలిత అరెస్టయ్యారు. జైలుపాలయ్యారు. తర్వాత బయటికొచ్చారు. అదే ఏడాది ఆగస్టులో ఆమెపై అక్రమ ఆస్తుల కేసును అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేశారు.
1998- లోక్‌సభ ఎన్నికల్లో, ఎన్ డిఎ కూటమిలో భాగంగా పోటీ చేసి తమిళనాడులోని 39 స్థానాల్లో 18 సీట్లను ఎఐఎడిఎంకె గెలుచుకుంది. వాజ్ పేయి ప్రభుత్వంలో చేరింది.
ఏప్రిల్ 1999- అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్ డిఎ ప్రభుత్వాన్ని జయలలిత కూలదోశారు.
అక్టోబరు 1999- కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఎఐఎడిఎంకే సీట్లను కోల్పోయింది. డిఎంకె భాగంగా ఉన్న ఎన్ డిఎ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2000- ప్లజంట్ స్టే హొటల్ - తాన్సీ భూసేకరణ కేసుల్లో జయలలిత దోషిగా నిర్ధారణ అయింది. వీటిపై ఆమె హైకోర్టుల్లో అప్పీలు చేసారు. ఆ అంశాలు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. శిక్ష నుంచి స్టే ఇచ్చినా, తదుపరి ఏడాది అసెంబ్లి ఎన్నికల్లో జయ పోటీ చెయ్యకుండా న్యాయస్థానం నిషేధించింది.
మే 2001- శాసనసభ ఎన్నికల్లో ఎఐఎడిఎంకె ఘన విజయం సాధించింది. మొత్తం 234 సీట్లలో 196 స్థానాలు గెలుచుకుంది. తాన్సీ, ప్లెజంట్ స్టే హొటల్ కేసుల్లో తీర్పుల పెండింగ్‌లో ఉండగానే, ఆ వివాదాలమధ్య ముఖ్యమంత్రిగా జయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
సెప్టెంబర్ 2001- ముఖ్యమంత్రిగా జయ నియామకాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తన విధేయుడు ఓ. పన్నీర్ సెల్వాన్ని ఆ పదవిలో జయ నియమించారు. సుమారు ఆరునెలలపాటు సీఎంగా ఉన్న పన్నీరు సెల్వం ఆమెకు కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో, సంఖ్యాశాస్త్ర కారణాలమీద తన పేరు చివర మరో ‘ఎ’ అక్షరాన్ని జయలలిత చేర్చుకున్నారు.
డిసెంబర్ 2001- తాన్సీ, ప్లెజంట్ స్టే హొటల్ కేసుల్లో ఆమెపై ఆరోపణల్ని న్యాయస్థానం కొట్టేసింది.
మార్చి 2002- ముఖ్యమంత్రిగా బాధ్యతలను తిరిగి జయ స్వీకరించారు.
ఆగస్టు 2003- సుమారు లక్షమంది ప్రభుత్వోద్యోగులు చేపట్టిన సమ్మెపై జయ కఠిన వైఖరి తీసుకున్నారు. విధులకు హాజరుకాని ఉద్యోగులపై తమిళనాడు అత్యవసర సేవల నిర్వహణ చట్టం (తెస్మా) ఉపయోగించి సస్పెన్షన్లు, తొలగింపులు చేపడతామని హెచ్చరించారు.
నవంబర్ 2003- జయలలితమీద ఉన్న అక్రమాస్తుల కేసును సక్రమమైన విచారణ కోసం కర్నాటకకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
మే 2004- ప్రభుత్వోద్యోగులు - సమాజంలోని ఇతర వర్గాల ఆగ్రహానికి గురైన అన్నాడిఎంకె లోక్ సభ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది.
మే 2006- శాసనభ ఎన్నికల్లో 61 సీట్లు మాత్రమే అన్నాడిఎంకె గెలుచుకోగలిగింది. అనేక చిన్న పార్టీలతో కూటమి కట్టిన డిఎంకె కొద్ది శాతం ఓట్ల తేడాతో గెలిచింది. డిఎంకె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మే 2009- మూడో కూటమిలో అన్నాడిఎంకె భాగస్వామి అయింది. అన్నాడిఎంకె- కాంగ్రెస్‌ల కూటమి అయిన యుపిఎ మెజారిటీ సీట్లను లోక్‌సభ ఎన్నికల్లో సాధించింది.
మే 2011- అన్నాడిఎంకే నాయకత్వంలోని కూటమి శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. 234 సీట్లలో 203 సీట్లను గెలుచుకుంది. అన్నాడిఎంకే ఒక్కటే 150 స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే సొంత బలం సంపాదించింది. అధికారంలోకి వచ్చిన జయలలిత అనేక జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టారు. రూపాయికే ఇడ్లీ - రూ. 3 రూపాయలకే పెరుగన్నం అందించే భోజనశాలలు - పది రూపాయలకే స్వచ్ఛమైన నీరు - ప్రజలకు ఉచితంగా గృహోపకరణాలు, విద్యార్థినులకు సైకిళ్ళు, ల్యాప్ టాప్ లు… ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టారు.
మే 2014- లోక్ సభ ఎన్నికల్లో 39 స్థానాలకుగాను 37 సీట్లను ఎఐఎడిఎంకె గెలుచుకుంది. కాంగ్రెస్ తర్వాత మూడవ అతి పెద్ద పార్టీగా లోక్ సభలో నిలిచింది.
సెప్టెంబర్ 27 - 2014- అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ళ జైలు - రూ. 100 కోట్ల జరిమానాను బెంగళూరు కోర్టు విధించింది. కొద్దిరోజుల ముందే వచ్చిన చట్టం ప్రకారం ముఖ్యమంత్రి పదవికి ఆమె అనర్హురాలయ్యారు. పరప్పన అగ్రహార జైల్లో ఆమె ఉన్నారు. ఆ సమయంలో మళ్ళీ పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
అక్టోబరు 17 - 2014- నెలరోజులు జైల్లో గడిపాక సుప్రీంకోర్టు ఆమెకు బెయిలు మంజూరుచేసింది.
మే 11 - 2015- అక్రమాస్తుల కేసులో అన్ని ఆరోపణలనుంచీ జయకు కర్నాటక హైకోర్టు విముక్తి ప్రసాదించింది. దీనితో పార్టీ వర్గాలు, ప్రజలు వేడుక చేసుకున్నారు.
మే 23, 2015- తమిళనాడు సీఎంగా మళ్ళీ జయ బాధ్యతలు చేపట్టారు.
జూలై 2015- కర్నాటక హైకోర్టు జయకు విముక్తి కల్పించడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మే 2016- శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగిన జయ చరిత్ర సృష్టించారు. తమిళనాడులో 32 ఏళ్ళ తర్వాత వరుసగా అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు స్థాపించారు. 234 సీట్లలో 134 గెలుచుకున్న ఎఐఎడిఎంకె తిరిగి అధికారంలోకి వచ్చింది.
సెప్టెంబరు 22 - 2016- జ్వరం, డీహైడ్రేషన్ తో చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. తర్వాత వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 73 రోజులపాటు ఆసుపత్రిలోనే గడిపారు.
డిసెంబరు 4 - 2016- గుండెపోటుకు గురైన జయను వైద్యులు సాధారణ వార్డునుంచి సీసీయూకు తరలించారు.
డిసెంబరు 5 - 2016- చికిత్స పొందుతూ రాత్రి 11-30 గంటలకు చెన్నై అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/