అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిని సామాన్యులు కలుసుకోవటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి పరిస్థితే ప్రముఖులకు ఎదురైతే? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విషయంలో కేంద్రమంత్రులు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారట. ఈ విషయాన్ని కేంద్రమంత్రులు స్వయంగా చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయిల్ మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రిని అయినా సులభంగా కలవొచ్చని కానీ తమిళనాడు సీఎంను కలవటం చాలా కష్టమని.. తమిళనాడు దేశంలోనే ప్రత్యేక దేశంగా మారిందని మండిపడ్డారు.
జయలలితను అతి కష్టమ్మీద ఒక్కసారి మాత్రమే కలిసినట్లుగా ఆయన చెబుతూ.. ‘‘ఆమె అనుమతి లేకుండా అక్కడ మంత్రులు.. అధికారులు ఏమీ చేయరు’’ అని విమర్శించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యల్ని అమ్మ వ్యతిరేక వర్గమైన డీఎంకే ఎన్నికల ప్రచారంలో వాడుకోవటం మొదలుపెట్టింది. ప్రజలు దేనినైనా క్షమిస్తారు కానీ నేతల అహంభావాన్ని భరించలేరు. ఆ విషయాన్ని గుర్తించిన డీఎంకే జయలలిత అహంకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టటం షురూ చేశారు.
ప్రత్యర్థుల వ్యూహాన్ని గుర్తించిన జయలలిత.. వారి విమర్శల్ని చిత్తు చేస్తూ.. తనను ప్రశంసించిన మరో కేంద్రమంత్రి మాటల్ని ఉదహరిస్తూ ఎదురుదాడి షురూ చేశారు. తనను కలవటం కష్టమని ఒక కేంద్రమంత్రి వ్యాఖ్యానించటాన్ని ఉదహరిస్తూనే.. మరోకేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తనను కలిసే విషయంలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదంటూ ఈ మద్యన చేసిన వ్యాఖ్యల్ని అమ్మ గుర్తు చేయటం గమనార్హం. ఏమైనా.. అమ్మను కలుసుకోవటం చాలా కష్టమన్న మాటను జనాల్లోకి తీసుకెళ్లేందుకు డీఎంకే బలంగా ప్రయత్నిస్తుంటే.. దాన్ని తిప్పి కొట్టేందుకు అమ్మ సైతం అంతేలా శ్రమించటం గమనార్హం.