త‌ల్లి జోలికి ఎందుకు జేసీ గారు?

Update: 2018-05-23 08:15 GMT
అనంత‌పురం ఎంపీ - టీడీపీ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర లేదు. నిత్యం త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో, చేష్ట‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తుంటారు జేసీ. ఇండిగో సిబ్బంది పై జేసీ దూకుడు ద‌గ్గ‌ర నుంచి....మొన్న పార్ల‌మెంటులో వైసీపీ ఎంపీల ముందు తొడ‌గొట్ట‌డం వ‌ర‌కు జేసీ తీరు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నిర్మొహ‌మాటంటా - నిస్సందేహంగా కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడ‌డం ఆయ‌న నైజం. త‌న మ‌న భేదం లేకుండా స్వ‌ప‌క్షం విప‌క్షం తేడా  లేకుండా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం జేసీ మేన‌రిజం. పీఎం మోదీ....సీఎం చంద్ర‌బాబు....ఎదుటి వ్య‌క్తి ఎంత‌టి వారైన స‌రే మాట‌ల‌దాడి చేయ‌డం జేసీకే చెల్లుతుంది. తాజాగా, జేసీ నోరుజారి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. గుత్తి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ కుమారుడిపై  జేసీ చేసిన‌ అనుచిత వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపుతున్నాయి.

అనంతపురం జిల్లా గుత్తిలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి జేసీ దివాక‌ర్ రెడ్డి పర్యటించారు. ఈ నేప‌థ్యంలో గుప్తాకు టీడీపీ సభ్యత్వం లేదని, తనకు పోటీగా గుప్తాను తీసుకొస్తున్నారని గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. ఇదే విష‌యాన్ని జేసీకి ఆయన వివ‌రించారు. అయితే, జితేంద్ర గౌడ్ కు గుత్తు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తులసమ్మ త‌న‌యుడు శీను మ‌ద్ద‌తుగా మాట్లాడారు. దీంతో, జేసీకి ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో, ఆగ్ర‌హం ప‌ట్ట‌లేని జేసీ....శీను - ఆయ‌న త‌ల్లిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ``నేను తలచుకుంటే  నువ్వు - నీ తల్లి ఉండరు``అని జేసీ బెదిరింపులకు దిగిన‌ట్లు తెలుస్తోంది. జేసీ వ్యాఖ్య‌ల‌పై జితేంద‌ర్ గౌడ్ - తుల‌స‌మ్మ‌ - శీను తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, మ‌న‌స్ప‌ర్థలు రావ‌డం స‌హ‌జ‌మని...అయితే, తల్లి జోలికి వెళ్లి జేసీ అనుచిత  వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమిట‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్య‌వ‌హారం పై సీఎంగారి స్పంద‌న ఏ విధంగా ఉంటుందో అన్న సంగ‌తి ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News