నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఉన్న పరపతి సైతం చంక నాకి పోతుందన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తిస్తే మంచిందన్న మాట వినిపిస్తోంది. హోదా విషయంపై ఏపీ అధికార.. విపక్షాల మధ్య హాట్ హాట్ గా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.తాను చెప్పినట్లే.. తన ఎంపీలు రాజీనామా చేసిన వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
ఏడు ప్రశ్నలతో బాబు నోట మాట రాకుండా చేశారు. అధినేతపై విరుచుకుపడిన జగన్ ను ఇష్టం వచ్చినట్లుగా విమర్శించటమే పనిగా పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు.. తామేం మాట్లాడుతున్నామన్న అవగాహన లేకుండా మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు నవ్వు తెప్పించటమే కాదు.. తెలుగు తమ్ముళ్ల ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. జగన్ పై విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టటమే కానీ.. తాము మాట్లాడుతున్న మాటల్లో లాజిక్ ఉందా? లేదా? అన్నది కూడా చూసుకోవటం లేదు.
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలే దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పాలి. ఆవేశం వచ్చినప్పుడు తనను తాను కంట్రోల్ చేసుకోవటంలో విఫలమవుతారని చెప్పే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. తాజాగా ఆ విషయం ఎంత నిజమన్నది తన మాటలతో చెప్పేశారు.
ఓపక్క ఇచ్చిన మాటకు తగ్గట్లే తన ఎంపీల చేత రాజీనామా చేయటం ద్వారా హోదా సాధన విషయంలో తమకున్న కమిట్ మెంట్ ను చెప్పకనే చెప్పేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లోక్ సభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే జగన్ పార్టీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను వ్యక్తిగతంగా కలిసి.. తమ రాజీనామా లేఖల్ని అందించారు. ఇదిలా ఉంటే.. జేసీ మాత్రం జగన్ కు దమ్ముంటే.. ధైర్యముంటే తన ఎంపీల చేత రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు. ఓపక్క స్పీకర్ కు తమ రాజీనామా పత్రాల్ని ఇచ్చేసి.. ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే.. మరోవైపు మగతనం.. ధైర్యం లాంటి మాటలు మాట్లాడుతున్న జేసీ.. తాను మాత్రం తన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. ఇంతకీ జేసీ చెప్పినట్లు.. ధైర్యం.. మగతనం ఎవరికి ఉన్నట్లు?