కక్షసాధింపుల గురించి మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నంత కాలం వ్యవస్ధలను మ్యానేజ్ చేసుకుని ఏ విధంగా జిల్లాలో, రాష్ట్రంలో వ్యవహారాలు నడిపింది ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అధికారాన్ని ఉపయోగించుకుని ట్రావెల్స్ ముసుగులో జేసీ కుటుంబం చేసిన మోసాలు, అక్రమాలు బయటపడటం వల్లే సోదరుడు, మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి జైలులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం వైసీపీ ప్రభుత్వం తమపై సాధిస్తున్న కక్షసాధింపు వల్లే తన సోదరుడు జైలులో ఉన్నాడని మాజీ ఎంపి చేసిన ఆరోపణలను నమ్మేంత అమాయకులు ఎవరు లేరన్న విషయం ఇంకా తెలుసుకోకపోవటమే విచిత్రంగా ఉంది.
ఈరోజు ఉదయం మాజీ ఎంపి అనంతపురంలోని గనుల శాఖ కార్యాలయంకు వెళితే అక్కడ చాలామంది అధికారులు కనబడలేదు. ఈ విషయాన్నే జేసీ మాట్లాడుతూ తమ గనులపై అధికారులు దాడులు చేయటాన్ని తప్పుపట్టారు. తమ గనుల్లో ఎవరైనా నక్సలైట్లు ఉన్నారా ? దాడులు చేయటానికి అంటూ విచిత్రమైన ప్రశ్న వేశారు. నక్సలైట్లుంటేనే అధికారులు దాడులు చేస్తారా ? అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం ఉంటే కూడా దాడులు చేస్తారని తెలీనంత అమాయకుడు కాదు మాజీ ఎంపి. నిజంగానే వాళ్ళ గనుల్లో నక్సలైట్లుంటే పోలీసులు లేదా యాంటీ నక్సల్ స్క్వాడ్ దాడులు చేస్తారు కానీ గనుల అధికారులు దాడులు చేస్తారా ?
పైగా పోలీసులకు, అధికారులకు జేసీ నీతులు చెబుతున్నారు. అధికారం శాశ్వతం కాదని, అధికారపార్టీకి బానిసలుగా మారద్దని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఇదే విషయం తాము అధికారంలో ఉన్నపుడు ఎందుకు గుర్తుకురాలేదో ? అధికారంలో ఉన్నంత కాలం తాడిపత్రిలోని వైసీపీ నేత, ఇప్పటి ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి అండ్ కో పై ఎన్నికేసులు పెట్టించలేదు ? ఎన్నిసార్లు జైలుకు పంపలేదు ? ఈ విషయాలను జనాలు మరచిపోయారని అనుకుంటున్నారేమో.
అధికారంలో ఉన్నపుడు తాము చేసిన అక్రమాలే ఇఫుడు ఎదురు తిరిగి తమ మెడకే చుట్టుకుంటుంటే జేసీ సోదరులు భరించలేకపోతున్నారు. తన తమ్ముడిని టార్గెట్ చేయటం అయిపోయిన తర్వాత ఇపుడు తనను టార్గెట్ చేస్తున్నట్లు అమాయకంగా చెబుతున్నారు. జేసీ ట్రావెల్స్ ముసుగులో జరిగిన అక్రమాలన్నీ బయటకు రావటం వల్లే అధికారులు కేసులు పెట్టి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్ధానం జైలుకు పంపింది. అక్రమాల్లో జేసీ సోదరులకు సహకరించిన వాళ్ళల్లో చాలామంది అప్రూవర్లుగా మారిపోయి కోర్టుల్లోనే జరిగిందంతా చెప్పేశారు. కాబట్టి ఇక్కడ కక్షసాధింపు అనటం కేవలం సింపతి కోసమే.
ఇక మాజీ ఎంపి గనుల విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఎప్పటి నుండో ఆరోపణలున్నాయి. ఇంతకాలం అధికారం ముసుగులో ఏమి చేసినా చెలామాణి అయిపోయింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైనా జాగ్రత్తగా ఉండకపోతే ఎలా ? చివరకు తమ గనుల్లో జరిగిన అవినీతి కూడా బయటపడుతున్నాయనే భయంతోనే బహుశా ముందు జాగ్రత్తగా జనాల సింపతీ కోరుకుంటున్నారేమో. చూద్దాం ఏమి జరుగుతుందో.