ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగరవేసి పారిశ్రామికవేత్తల జాబితాను ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషస్ (ఏఐబీఈఏ) విడుదల చేసింది. 5600 మందికి పైగా రుణ గ్రహీతలు సుమారు రూ. 58,792 కోట్లను ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్లు యూనియన్ ఆరోపించింది. ఈ సందర్భంగా ఇలా రుణాలను ఎగవేసిన వారి జాబితాను విడుదల చేసింది. ఇందులో అనేక ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో పాటు రాజకీయ నాయకులకు చెందిన కంపెనీలూ ఉన్నాయి. అనంతపురం తెలుగు దేశంలో జేసి దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన ట్రైడింట్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కూడా ఈ జాబితాలో ఉంది.
ఆంధ్రాబ్యాంకు నుంచి ఈ కంపెనీ రూ. 28.55 కోట్ల రుణం తీసుకుంది. వడ్డీ కలిసి ఈ బకాయి రూ 31.96 కోట్లకు చేరినట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘం పేర్కొంది. ట్రైడెంట్ పవర్ సిస్టమ్స్ లో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు జేసీ పవన్ రెడ్డి, జేసీ సంయుక్త రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీలో జేసీ దివాకర్ రెడ్డి భార్యకు 1,90,100 షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీలో ఆమెకు మెజారిటీ వాటా ఉన్నట్లు తెలుస్తుంది. కుమారుడు. కోడలు డైరెక్టర్టుగా ఉన్నా .. మెజారిటీ వాటా ఆమె పేరుతో ఉన్నట్లు అనధికార సమాచారం.
2009 ఏప్రిల్ 27న ఆంధ్రాబ్యాంకు నుంచి రూ. 26.08 కోట్ల రుణం తీసుకున్నారు. చరాస్తులను తనఖా పెట్టి ఈ రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్ధిరాస్తులు తనఖాలో లేనందుకు బ్యాంకు కూడా ఏమీ చేయలేకపోతోందని సమాచారం. రుణం తీసుకుని ఏడేళ్ళవుతున్న .. తిరిగి చెల్లించకపోవడంతో నిరర్ధక ఆస్తిగా బ్యాంకు పేర్కొంది. అయితే బ్యాంకు ఉద్యోగులు విడుదల చేసిననేటి జాబితాలో ఈ కంపెనీని ఉద్దేశ్యకపూర్వక ఎగవేతదారుగా చూపించారు. ఇప్పటికే సుజనా చౌదరి - కావూరి సాంబశివరావు వంటి తెలుగు నేతలు రుణాల ఎగవేత కేసుల్లో ఉండా తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి కూడా అందులో చేరారు.