పాత బాస్ కు జేసీ క్లాస్

Update: 2015-08-05 10:06 GMT
టీడీపీ ఎంపీ, ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జేసీ దివాకరరెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కడిగిపారేశారు. కాంగ్రెస్ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసినందుకే సోనియాగాంధీ బ్లాక్ డే అంటూ విమర్శలకు దిగితే ...రాష్ట్ర విభజన బిల్లు ఆమెదం సందర్భంగా జరిగిన దానిని ఏమనాలని జేసీ దివాకరరెడ్డి ప్రశ్నించారు. సోనియా ద్వంద్వ నీతికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుందని  ఆయన ఘాటుగా విమర్శించారు.

సోనియాగాంధీ వల్లే కాంగ్రెస్ కు ఈ దుస్థితి వచ్చిందని.. ఆ పార్టీ బాగుపడే పరిస్థితి లేదని విమర్శించారు. పాతిక మంది కాంగ్రెస్ ఎంపీలను ఐదు రోజులు సస్పెండ్ చేసినందుకే సోనియా ఇంత హడావుడి చేస్తున్నారనీ, యూపీఏ హయాంలో పార్లమెంటు నుంచి సొంత పార్టీ ఎంపీలను కూడా గెంటేసి, తలుపులు మూసేపి, విద్యుత్ సరఫరా నిలిపివేసి, టివీ ప్రసారాలను కట్ చేసి మరీ విభజన బిల్లును ఆమోదింప చేసుకున్న సంగతి ఆమెకు ఇప్పడు గుర్తులేదా అని జేపీ దివాకరరెడ్డి అన్నారు.  జేసీ ప్రశ్నతో కంగుతిన్న కాంగ్రెస్ వర్గాలు ఆయన విమర్శలకు ప్రతి విమర్శ చేయడానికి కూడా వెనుకాడుతున్నాయి.
Tags:    

Similar News