అవకాశం దొరికితే చాలు తాను అనుకున్నది బయటపెట్టేసే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోమారు కలకలం రేపే కామెంట్లు చేశారు. ఈ దఫా మీడియా ముందు కాకుండా...పార్టీ సమావేశంలో - పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే జేసీ ఓ రేంజ్ లో స్పందించారు. రాజకీయాలను - పార్టీలోని రాజకీయాలను కూడా జేసీ తనదైన శైలిలో విశ్లేషించారు. అనంతపురంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ... అనంతపురం జిల్లాలో ఎస్పీ కాకుండా పోలీసులు అందరూ వంగి - వంగి నమస్కారాలు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఎమ్మెల్యేలకు సెల్యూట్ కొడుతున్నారని పేర్కొంటూ...ఓ కానిస్టేబుల్ టీడీపీ కార్యకర్తని బెదిరించారని చెప్పుకొచ్చారు.
టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి అలా ఉండదని వ్యాఖ్యానించిన జేసీ...రెండున్నర సంవత్సరాల లోపే ఎన్నికలు వస్తాయని కలకలం రేపే కామెంట్లు చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా...టీడీపీ వాళ్లను ఇబ్బంది పెట్టిన ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలు సహజంగానే వివాదాస్పదంగా మారాయి. అయితే జేసీ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు ఖండించడం పోవడం - కనీసం ఆయన్ను వారించకపోవడం గమనార్హం.
మరోవైపు చంద్రబాబును సైతం జేసీ ఇరుకున పడేశారు. ఎన్నికలకు ముందు పార్టీలో కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దని చెప్పినప్పటికీ తన మాట వినలేదన్నారు. ఎప్పుడూ శాంతి వచనాలు - శాంతి వచనాలు అంటూ మమ్మల్ని చంకనాకించావ్ అంటూ చంద్రబాబును పార్టీ కార్యకర్తల ముందే కామెంట్ చేశారు. బాబును అందరూ మోసం చేస్తున్నారని జేసీ చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు.