కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉండి..గత ఎన్నికల్లో టీడీపీలో చేరిన సీనియర్ నాయకుడు ప్రస్తుత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైకిల్ పార్టీలో కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి `స్వతంత్రత`ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో వలే తనకు నచ్చినట్లుగా మాట్లాడేసే జేసీ తాజాగా అదే రీతిలో కలకలం రేపే కామెంట్లు చేశారు. గతంలో వలే...తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును బుక్ చేసే కామెంట్లు చేశారు. ఈ మాటలతో టీడీపీ శ్రేణులు కలవరానికి గురికావడం గమనార్హం.
కడప ఉక్కుప్లాంట్ కోసమంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సీఎం రమేష్ దీక్ష వేదికపై ఇవాళ జేసీ మాట్లాడుతూ సీఎం రమేష్ దీక్ష చేస్తే ఉక్కు..తుక్కు ఏం రాదని అన్నారు. దివంగత పొట్టి శ్రీరాములు స్థితికి రమేష్ వెళ్లినా.. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతవరకు ఈ ప్రాంతానికి ఉక్కు కర్మాగారం రాదని చెప్పారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అని - రాష్ట్రానికి ప్రధాని ఏమీ చేయరని విమర్శించారు. `చంద్రబాబు ఏం తక్కువవాడు కాదు.. నాటకాలడటం - డ్రామాలు ఆడించడం - మాటలు చెప్పడం - కుయుక్తులు పన్నడం అన్నీ తెలుసు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు`` అని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ సీఎంగా ఉండగా ఒక వర్గాన్ని హత్యలు చేసిన మోడీ.. ప్రధానిగా ఉండటానికి అర్హత లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఉక్కు కర్మాగారం వస్తే ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయని అయితే సీఎం రమేష్ దీక్ష చేసినంత మాత్రాన కడపకు ఉక్కు కర్మాగారం వచ్చేయదని జేసీ వ్యాఖ్యానించారు. దీక్షలో నిజాయితీ లేదని - మందులతో సాగు చేసిన తిండి తింటున్న వారిలో నిజాయితీ ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని కర్మాగారం కోసం 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారని, అదే తరహాలో మరో ఉద్యమం అవసరమని జేసీ అన్నారు. సొంత పార్టీ నేతలపైనే జేసీ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు - తెలుగు తమ్ముళ్లు ఒక్కసారి అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి జోక్యం చేసుకొని జేసీ కామెంట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీక్షను ప్రోత్సహించి ఏవో నాలుగు మంచి మాటలు మాట్లాడకుండా... ఇలా మాట్లాడడం తగదని జేసీకి సభా వేదికగానే ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.