సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ అయిన అనంతపురం ఎంపీ - టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి... ఎన్నికల ముంగిట మరో సంచలన వ్యాఖ్య చేశారు. తెలుగు నేల విభజన తర్వాత కాంగ్రెస్ కు హ్యాండిచ్చేసి టీడీపీలో చేరిపోయిన జేసీ... అప్పుడే టీడీపీలో ఐదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. రాజకీయాలపై విరక్తి వచ్చిందో - లేక తనయులను రాజకీయంగా వృద్ది చేయాలనుకున్నారో ఏమో తెలియదు గానీ... ఈ ఎన్నికల్లోనే రాజకీయ సన్యాసం ప్రకటించేసిన జేసీ... తన స్థానంలో తన తనయుడు పవన్ రెడ్డిని బరిలోకి దించేశారు. తనతో పాటు తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా సన్యాసం ప్రకటించేసిన జేసీ... తన సొంతూళ్లో తమ్ముడి కుమారుడిని బరిలోకి దించారు. మొత్తంగా జేసీ బ్రదర్స్ పోటీ నుంచి తప్పుకుని తనయులను రంగంలోకి దించేశారు.
ఇలాంటి తరుణంలో కుమారుల గెలుపు కోసం తమదైన శైలిలో యత్నాలు చేస్తున్న జేసీ బ్రదర్స్... ఇటీవల కాస్తంత శాంతించినట్టుగానే కనిపిస్తున్నారు. అయితే ఎంత రాజకీయ సన్యాసం తీసుకుంటే మాత్రం... తమదైన శైలి సంచలన కామెంట్లకు వారు ఎలా స్వస్తి చెబుతారు? నిజమే... రాజకీయాల్లో ఉన్నా - లేకున్నా కూడా జేసీ దివాకర్ రెడ్డి మాత్రం అసక్తికర కామెంట్లను మాత్రం వదిలేది లేదని తేల్చి చెప్పేశారు. అయినా ఇప్పుడు జేసీ ఏం వ్యాఖ్యలు చేశారన్న విషయానికి వస్తే... తాను టీడీపీలోనే ఉన్నా... తన ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం మాత్రం కాంగ్రెస్ దేనని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు.
అంతేకాకుండా న్యాయంగా అయితే తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీలో ఉండాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ను తాను చిన్నప్పటి నుంచి చూశానని - న్యాయంగా అయితే జగన్ పార్టీలో చేరాలని చెప్పిన జేసీ... జగన్ బుద్ధి ఏంటో తెలుసు కాబట్టే టీడీపీలో చేరానని ఆయన చెప్పారు. ఎంతైనా టీడీపీలో ఉన్నారు కదా... అందుకేనేమో చివరలో టీడీపీకి అనుకూలంగానూ ఆయన ఓ చిన్న వ్యాఖ్య చేశారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని జేసీ ముక్తాయించారు. ఈ లెక్కన ఒకే సందర్భంలో అటు కాంగ్రెస్ - ఇటు వైసీపీ... చివరలో టీడీపీలపై తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన జేసీ తనదైన మార్కును చూపించారనే చెప్పాలి.