జేసీ సంచ‌ల‌నం...40% మంది ఎమ్మెల్యేల‌ పై అసంతృప్తి

Update: 2018-10-22 15:40 GMT
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా వార్త‌ల్లో నిలిచే అనంత‌పురం ఎంజీ జేసీ దివాక‌ర్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. అనంతపురంలో ఎంపీ జేసీ వర్గం, ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం రూపంలోని విభేదాలు  తారాస్థాయికి చేరడం, అనంత‌రం ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో జేసీ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం తెలిసిన సంగ‌తే. తాజాగా క‌ల‌క‌లం సృష్టించే వ్యాఖ్య‌ల‌ను సైతం చేశారు.అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ 40 శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉందని ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. సాక్షాత్తు సిట్టింగ్ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్య‌లు తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితిని స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని ప‌లువురు అంటున్నారు.

అమరావతిలో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పై ప్రజల్లో సానుకూలత ఉందన్న జేసీ ఎమ్మెల్యేల‌పై మాత్రం వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. 40 % మంది ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. ఆ ఎమ్మెల్యేలను మారిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌ - జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌లు కలుస్తారని తాను అనుకోవడం లేదని జేసీ వివరించారు. 'జగన్‌ - పవన్‌లు భిన్న ధ్రువాలు. వారిద్దరూ కలిసే అవకాశమే లేదు. వారిద్దరూ తమ సీట్లు గెలుస్తారు తప్ప టికెట్లు ఇచ్చిన వారిని గెలిపించుకోలేరు' అని జేసీ అన్నారు. కాగా, జేసీ వ్యాఖ్య‌లు అధికార టీడీపీలో పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరును చాటిచెపుతున్నాయ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News