జగన్ - చంద్రబాబు పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు !

Update: 2020-05-30 10:50 GMT
జేసీ దివాకర్ రెడ్డి ..తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటుగా దేశ రాజకీయాలలో కూడా బాగా గుర్తింపు ఉన్న పేరు. దీనిగురించి అయిన సూటిగా మాట్లాడాలి అంటే జేసీ తరువాతే ఎవరైనా. ఏ పార్టీలో ..ఏ నేత గురించి మాట్లాడాలన్నా, చివరకు సొంత పార్టీ అధినేత గురించి మాట్లడాలన్నా ఆయనంత ముక్కుసూటిగా మాట్లాడే నేత మరొకరు ఉండరు అని అనడంలో అతిశయోక్తిలేదు. అయన ఏం మాట్లాడినా కూడా అదొక సంచలనమే.

జేసీ ఎంత ఘాటు విమర్శలు చేసినా, పచ్చి ఆరోపణలు గుప్పించినా, ఘోరంగా నిందించినా ఎదుటి వారిలో అంత ఆగ్రహం మాత్రం రాదు. ఎందుకంటే జేసీ వ్యాఖ్యల్లోని ఖరుకుదనం వెనక ఉన్న సున్నితత్వం, హాస్యం, ఒకింత అమాయకత్వం ఎదుటివారి మనోభావాలు నొప్పించవనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుంటాయి. తాజాగా ఏపి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పట్ల, టీటీడీ ఆస్తుల అమ్మకం పట్ల జేసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సొంత పార్టీ పైనైనా ..ఇంకోపార్టీ గురించి అయిన ఏదైనా కామెంట్స్ చేయాలి అంటే జేసీ తరువాతే. ఆయనకి నచ్చింది ..అయన అనుకున్నది ..అసలు మొహమాటం లేకుండా చెప్పేస్తారు. కొన్నిసార్లు పార్టీలు, ప్రభుత్వాల రహస్యాలు బట్టబయలు చేయడమే కాకుండా అంతర్గతంగా జరిగే విశ్వసనీయ సమాచారాన్ని కూడా తేలిగ్గా చెప్పేస్తుంటారు ఆ మద్య టీడీపీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇళ్లల్లోనే నిరసన తెలిపాలని పిలుపునిస్తే అందుకు టీడిపి పెద్దలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు జేసీ. నడిరోడ్డు మీద ఆమరణ నిరిహార దీక్ష చేస్తేనే పట్టించుకోని జగన్ ఇలాంటి ఇళ్లల్లో చేసే నిరసనలను పట్టించుకోడని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు

అలాగే ఎన్నికల ముందు భజన చేసే వాళ్లను పట్టించుకోకండి చంద్రబాబు, వాళ్లతో ఎప్పటికైనా ప్రమాదమేనని ఎంత చెప్పినా బాబు వినలేదని, సిట్టింగులకు సీట్లు ఇవ్వొద్దని ఖరాఖండిగా చెప్పినా బాబు అపుడు వినలేదని , దాని ఫలితం ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు తెలిసిందంటూ చెప్పుకొచ్చారు. అలాగే సీఎం జగన్ పాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు జేసీ. చంద్రబాబు కొన్ని విషయాల్లో మొండిగా ఉండాలంటే వినరు అని ..సీఎం జగన్ కొన్ని విషయాల్లో మొండిగా ఉండకూడదు అంటే వినరు అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అలాగే టీటీడీ భూముల అమ్మకం నిర్ణయం గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తిరుమల వెంకన్న ఆస్తులు అమ్మాలంటూ టీటీడీ చేసిన నిర్ణయం బోర్డు నిర్ణయం అని అందరూ భావిస్తున్నారని, కానీ అందులో వాస్తవం లేదని, స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పై శ్రీవారి భూములు అమ్మే ప్రక్రియకు ఒత్తిడి తీసుకొచ్చారని ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేసారు.చూడాలి మరి జేసీ కామెంట్స్ పై టీటీడీ - ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో..
Tags:    

Similar News