జేసీ కొడుకు కంటే కోడ‌లే ఎక్కువ ఐటీ క‌డ‌తార‌ట‌!

Update: 2019-03-21 07:44 GMT
పెద్దోళ్ల ముచ్చ‌ట్లు ఒక ప‌ట్టాన బ‌య‌ట‌కు రావు. ఆస్తులు.. అప్పుల విష‌యాలు సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. అయితే.. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన వేళ‌.. వారి ఆస్తుల అప్పుల చిట్టాను ఎన్నిక‌ల సంఘానికి వెల్ల‌డించాల్సిన నేప‌థ్యంలో ప‌లువురు నేత‌ల అధికారిక ఆస్తుల లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి.

తాజాగా అనంత‌పురం ఎంపీ స్థానానికి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి కుమారుడు జేసీ ప‌వ‌న్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌మ‌ర్పించిన ఆఫిడ‌విట్ లోని అంశాలు ఆస‌క్త‌కిరంగా మారాయి. ఇప్ప‌టివ‌ర‌కూ జేసీ కుమారుడిగానే త‌ప్పించి.. ఆయ‌న ఆస్తుల లెక్క బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు.

ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ఆయ‌న కంటే కూడా ఆయ‌న స‌తీమ‌ణి సంయుక్త ప్ర‌తి ఏటా ప‌ద‌కొండు ల‌క్ష‌ల ఐటీ మొత్తాన్ని అధికంగా క‌డుతున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎలాంటి కేసులు లేని ప‌వ‌న్ రెడ్డి ప్ర‌తి ఏడాది రూ.24ల‌క్ష‌ల‌కు పైనే ఐటీ క‌డుతున్నారు. ఇక‌.. ఆయ‌న స‌తీమ‌ణి సంయుక్త ఏడాదికి రూ.35లక్ష‌ల వ‌ర‌కూ ఐటీ క‌డుతున్నారు.

ప‌వ‌న్ ఆస్తుల లెక్క‌లోకి వెళితే..

- పెద్దపప్పూరు మండలం జూటూరులో 130.87 ఎకరాలు మెట్టభూమి

-  హైద‌రాబాద్ శివారులోని  శంషాబాద్‌ సమీపం వ‌ద్ద ఉన్న‌ తొండపల్లి గ్రామంలో సర్వే నెంబర్‌-170లో 2,17,800 చదరపు అడుగుల స్థలం

- పుట్లూరు మండలం కుమ్మనమలలో 16.58 ఎకరాలు భూమి ఉంది. దీని మార్కెట్‌ విలువ రూ. 99.48 లక్షలుగా చూపారు.

- హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం-10లో ఫ్లాట్‌ నెం-138ఏలో 22833 చదరపు అడుగుల స్థలం ఉంది. 2011లో రూ. 10.90 కోట్లతో కొనుగోలు. రూ. 3.90 కోట్లతో ఇళ్లు నిర్మించాడు. ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్ర‌కారం రూ. 16.95 కోట్లు చేస్తుంది.

- 1113.61 గ్రాముల బంగారు ఆభరణాలు - 498.91 గ్రాముల వజ్రాభరణాలు ఉన్నాయి.
 
ప‌వ‌న్ స‌తీమ‌ణి  సంయుక్త పేరిట ఆస్తులు

- పెద్దపప్పూరు మండలం జూటూరులో 6.27 ఎకరాలు మెట్టభూమి. యాడికి మండలం గుడిపాడులో 28,314 చదరపు అడుగుల స్థలం ఉంది. 2011లో రూ. 21,710లకు కొనుగోలు చేశారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 87 వేలు.
 
- యాడికి మండలం గుడిపాడులో 79,279 చదరపు అడుగుల స్థలం ఉంది.

- 2002లో రూ. 5,22,550లకు కొనుగోలు చేశారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 24.75 లక్షలు.

- తాడిపత్రి పట్టణ సమీపంలోని హుసేనాపురంలో 12963 చదరపు అడుగుల స్థలం ఉంది. 2016లో ఈ స్థలాన్ని రూ. 11,34,775లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌ విలువ రూ. 13.61 లక్షలు.
 
- సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌ లో 21,780 చదరపు అడుగుల స్థలం ఉంది. 2018లో రూ. 84.80 లక్షలకు జాయింట్‌ గా మరొకరితో కలిసి కొన్నారు. వీరి వాటాగా రూ. 42.41 లక్షలు ఉంది. ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్‌ విలువ రూ. 43.50 లక్షలు.
 
జేసీ పవన్‌ అప్పులు....

- ట్రీ డెన్ట్‌ పవర్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ పరిశ్రమకు సంబంధించి రూ. 29.98 లక్షలు రుణం తీసుకున్నారు.
 
జేసీ సంయుక్త పేరున అప్పులు

- భ్రమరాంబ మినరల్‌ కంపెనీ పేరున..  ట్రీ టెన్డ్‌ పవర్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ పేరున రుణం తీసుకున్నారు.

ఇవి కాకుండా భార్య‌భ‌ర్త‌ల పేరు మీద ప‌లు పాల‌సీలు.. బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఇవ‌న్నీ భారీ మొత్తంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ స‌తీమ‌ణి సంయుక్త పేరు మీద జాయింట్ ఇన్వెస్ట్ మెంట్లుపెద్ద ఎత్తున ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు. ప‌లు కంపెనీల్లో ఆమె పేరుతో పెట్టుబ‌డులు ఉన్నాయి.
  


Tags:    

Similar News