ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల వల్ల ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తుతాయన్నారు. అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తేనే సాధికారిత సాధ్యమవుతుందని లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసినంత మాత్రాన ఏమీ జరగదన్నారు.
'ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని ఉండాలంటున్నారు.. మరి రాయలసీమ అభివృద్ధి చెందాలంటే తమకు రాజధాని వద్దా అని అక్కడి ప్రజలు డిమాండు చేస్తున్నారు. దీని వల్ల ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు' అని పేర్కొన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శాసనసభ సాక్షిగా తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ ప్రతి జిల్లాను ఒక రాజధానిగా తయారుచేయాలని లక్ష్మీనారాయణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడే అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 'ఆంధ్రుడా మేలుకో' కార్యక్రమానికి లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ... మహారాష్ట్ర తరహాలో ప్రతి జిల్లాను ఒక రాజధానిగా అభివృద్ధి చేస్తే ప్రాంతాల మధ్య ఎటువంటి వివాదాలు తలెత్తవన్నారు. అక్కడ 22 ఏళ్లు పని చేసిన అనుభవంతో తాను ఈ మాట చెబుతున్నానన్నారు.
మహారాష్ట్రలో అనేక పట్టణాలు అభివృద్ధి చెందాయని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ముంబయి, పుణే, థానే, ఔరంగాబాద్, నాగ్‌పూర్, నాసిక్ చుట్టూ ఎన్నో పరిశ్రమలొచ్చి ఉద్యోగాలు పెరిగాయన్నారు. అక్కడి ప్రజలు బయట రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం అందుకే పెద్దగా ప్రయత్నించరని తెలిపారు. ఏపీలోనూ ప్రతి జిల్లాను ఆ విధంగా తీర్చిదిద్దితే మనకూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. తమిళనాడులో రాష్ట్రంలోనూ ప్రతి జిల్లా ఏదో ఒక రంగంలో ముందుకు వెళుందని తెలిపారు.
మహారాష్ట్ర హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ముంబయిలో ఉందని లక్ష్మీనారాయణ చెప్పారు. హైకోర్టు రెండు బెంచ్‌లను నాగ్‌పూర్, ఔరంగాబాద్‌ల్లో ఏర్పాటు చేశారని వెల్లడించారు. మనరాష్ట్రంలో కూడా ఇలాగే అమరావతిలో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ పెట్టి విశాఖ, కర్నూలులో బెంచ్‌లు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లోని న్యాయపరమైన సమస్యలను అక్కడికి తీసుకెళ్లవచ్చని సూచించారు. అలాగే శీతాకాల సమావేశాలను విశాఖ, కర్నూలులో పెట్టుకోవచ్చు అని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.