దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా ప్రచారం పొందిన మునుగోడు ఎన్నిక గురించి తెలిసిందే. ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. వేసిన లెక్కల ప్రకారం ఆ ఉపపోరు కోసం రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు దగ్గర దగ్గర రూ.700 కోట్లుగా లెక్క కట్టారు. అయితే.. ఈ ఖర్చు లెక్క తక్కువని చెబుతున్న రాజకీయ వర్గాలు అనధికార మాటల్లో చెబుతున్న లెక్క ఎంతో తెలుసా? అక్షరాల వెయ్యి కోట్ల రూపాయిలు. నిజంగానే ఇంత భారీ ఖర్చు ఒక ఉప ఎన్నిక కోసం జరిగిందా? అంటే అవుననే అంటున్నారు.
నిజానికి మునుగోడు ఉప ఎన్నికతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇలానే ఎన్నికల ఖర్చు పెంచుకుంటూ పోతే.. ఎక్కడికి వెళతాం? ఎంతవరకు వెళ్లగలం? అన్న మాట వినిపిస్తోంది. ఎన్నికైన నాటి నుంచి కోట్లు కొల్లగొట్టటం తప్పించి మరో ఆలోచన లేకుండా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇలాంటి వేళలోనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. కొత్త చర్చకు తెర తీశారు.
'ఎన్నికల శంఖారావం' పేరుతో ఆయన తన అభిప్రాయాన్ని పోస్టు రూపంలో వెల్లడించారు. ఆయన పెట్టిన పోస్టును యథాతధంగా చూస్తే.. ''నిజమైన ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంస్కరణలే పరమావధి. స్వచ్చమైన ఓటు సద్వినియోగం అవ్వడానికి కావలసిన ఎన్నికల సంస్కరణలకు నేటి నుంచే నడుం బిగిద్దాం. ప్రతిరోజూ మీ అభిప్రాయం కోసం ఒక సంస్కరణను సూచిస్తాము. వీటిని సుప్రీంకోర్టులో పిల్ ద్వారా సాధించే ప్రయత్నం చేద్దాం'' అని అన్నారు.
ఇందులో భాగంగా తాను ప్రతిపాదిస్తున్న సంస్కరణల్ని ఆయన పేర్కొంటూ..
సంస్కరణ -1 ''ఒక ప్రజా ప్రతినిధి (ఎంపీ లేదా ఎమ్మెల్యే) తన పదవీకాలం పూర్తయ్యేలోపు పదవికి రాజీనామా చేస్తే, ఎన్నికల్లో తదుపరి అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని మిగిలిన కాలానికి ప్రజా ప్రతినిధిగా ప్రకటించాలి'' అని పేర్కొన్నారు. అయితే.. ఈ సంస్కరణ మీద నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది.
ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యుడు గెలిస్తే.. తమ బలాన్ని పెంచుకోవటానికి విపక్ష ప్రజాప్రతినిధి చేత రాజీనామా లాంటివి చేసేలా చేస్తే.. అప్పుడు అంతటా అధికారపక్షానికి చెందిన వారే ఉంటారని.. కొత్త తరహా కొనుగోలుకు తెర తీస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మొత్తంగా.. ఎంపీగా.. ఎమ్మెల్యేగా ఉన్న వారు తమ పదవులకు రాజీనామా చేస్తే ఏం చేయాలనే దానికి సంబంధించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన ప్రతిపాదన సాధ్యాసాధ్యాల్ని పక్కన పెడితే.. కొత్త చర్చకు మాత్రం అవకాశాన్ని ఇచ్చిందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.