ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణతో పాటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి కూడా కొత్త సారథి ని ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిర్ణయించినట్లు తెలియవచ్చింది.రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం కావడం - పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒకరి తర్వాత ఒకరుగా పార్టీని వీడి అధికార టీఆర్ ఎస్ లో చేరు తుండడానికి కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలకు తోడు రాష్ట్ర స్థాయిలో నాయకత్వ అసమర్థతే కారణమన్న అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ నుండి లోక్ సభకు ఎన్నికైన ఇద్దరు పార్లమెంట్ సభ్యులలో ఒకరైన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే.. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి తీవ్రంగా మందలించింది. పీసీసీని మొత్తం ప్రక్షాళన చేస్తామని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పీసీసీ పునర్వ్యవస్థీకరణకు వీలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుండి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ అప్పటికప్పుడే రాజీనామా లేఖను తీసుకొన్నట్లుగా కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క కూడా ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకొని తన రాజీనామా లేఖను అందజేసినట్లు తెలుస్తోంది.
అయితే.. సీనియర్ లీడర్లు ఒక్కరొక్కరుగా టీఆరెస్ లోకి వెళ్లిపోవడం.. ఉన్నవారిలో కొందరికి ఇతర పదవులు ఉండడంతో పీసీసీ సారథ్య బాధ్యతలు ఎవరికి ఇవ్వాలన్నది పెద్ద సమస్యగా మారింది. ఈసారి యువ నాయకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం ఉన్న కరీంనగర్ జిల్లా నేత శ్రీధర్ బాబును పీసీసీ సారథి చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. కొద్దికాలంగా ఆయన యాక్టివ్ గా లేరని వినిపిస్తోంది. దీంతో అదే జిల్లాకు చెందిన జీవన్ రెడ్డికి కూడా ఛాన్సు రావొచ్చని సమాచారం. జీవన్ రెడ్డికి అధిష్ఠానం వద్ద పెద్దగా పలుకుబడి లేనప్పటికీ రాష్ట్రంలో టీఆరెస్ తో తలపడుతున్న ఒకరిద్దరు నేతల్లో ఆయన ముందు వరుసలో ఉన్నారు. అనుభవం - దూకుడు - సమన్వయం అన్నీ ఉన్న జీవన్ పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది.