మెగా ఫ్యామిలీకి జీవితా రాజశేఖర్ కుటుంబానికి మధ్య లెక్కలు ఏదో రకంగా తేడా వస్తూనే ఉంటాయి ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో చిక్కుకొని వార్తల్లోకి వస్తుంటారు. విచిత్రమైన విషయం ఏమంటే.. జీవితా రాజశేఖర్ దెబ్బకు మెగా ఫ్యామిలీ ఎప్పుడు డిఫెన్స్ లో పడుతూ ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది.
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జీవిత.. రాజశేఖర్ లు బరిలోకి దిగటం తెలిసిందే. వీరిద్దరూ నరేశ్ ప్యానల్ తరఫున పోటీ చేస్తే.. వారికి పోటీగా శివాజీరాజా ప్యానల్ నడిచింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య నడిచే మాటల యుద్ధాన్ని తలపించేలా ఈసారి మా ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే.. తాను రెగ్యులర్ గా మద్దతు ఇచ్చే శివాజీరాజా ప్యానల్ కు జెల్లకాయి ఇచ్చి మరీ.. నరేశ్ ప్యానల్ కు మెగా బ్రదర్ నాగబాబు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.
అంతేకాదు.. జీవిత..రాజశేఖర్ లకు ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికల అనంతరం శివాజీరాజా మాట్లాడుతూ నాగబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పేర్కొనటం మర్చిపోకూడదు. నాగబాబు మద్దతు ఇచ్చిన నరేశ్ ప్యానల్ విజయం సాధించటం.. జీవిత రాజశేఖర్ లు గెలుపొందటం తెలిసిందే. ఎన్నికలకు రెండు రోజుల ముందు నరేశ్ ప్యానల్ కు తన మద్దతు ప్రకటించిన నాగబాబు.. జీవిత తరఫున ప్రచారం చేస్తూ.. మహిళలకు న్యాయం జరగాలంటే జీవితను గెలిపించాలని ప్రచారం చేశారు.
నాగబాబు నేరుగా సీన్లోకి వచ్చాక.. ఆయన వెనుక ఉన్న మెగాస్టార్ చిరు కావొచ్చు.. నాగార్జున సైతం పరోక్షంగా నరేశ్ ప్యానల్ కు మద్దతు ఇచ్చినట్లు అయ్యింది. దీంతో శివాజీరాజా గ్రూపు ఓటమికి కారణంగా మారింది. ఇంతలా వారి వెనుక నిలిచిన నాగబాబుకు తాజాగా వారిద్దరూ భలేగా హ్యాండిచ్చినట్లుగా చెప్పాలి.
మా ఎన్నికలు ముగిసి నెల కూడా కాలేదు.. నాగబాబు మద్దతుతో గెలిచిన జీవిత రాజశేఖర్ లు తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం షాకింగ్ గా మారింది. పార్టీలో చేరటం ఒక ఎత్తు అయితే.. మెడలో జగన్ పార్టీ కండువా పడిన వెంటనే పవన్ విమర్శిస్తూ జీవిత వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు.. ఇటీవల ఆంధ్రా వారికి హైదరాబాద్ లో భద్రత కరువు అంటూ తెలంగాణ ప్రభుత్వంపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యల మీద పార్టీలో చేరిన వెంటనే జీవిత రాజశేఖర్ లు తప్పు పట్టటం ఒక ఎత్తు అయితే.. దగ్గరుండి గెలిపించిన మెగా ఫ్యామిలీకి జీవితా రాజశేఖర్ లు ఇచ్చిన షాకులు మామూలుగా లేదంటున్నారు. అదేం సిత్రమో కానీ మొదట్నించి జీవితా రాజశేఖర్ లు షాకులు ఇవ్వటం.. వాటికి మెగా ఫ్యామిలీ విలవిలలాడటం అలవాటుగా మారిందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం.