జీవితా రాజశేఖర్ ధర్నా.. కేసీఆర్ - జగన్ లకు సూటి ప్రశ్న

Update: 2021-01-13 07:56 GMT
ప్రముఖ సీనియర్ నటి జీవితా రాజశేఖర్ రోడ్డెక్కారు. హక్కుల సాధన కోసం నినదించారు. ఆమె చేసిన ఈ ఆందోళన చర్చనీయాంశమైంది. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో యజ్ఞం పవన్ ఆధ్వర్యంలో ఆమె ఈ ధర్నా చేశారు.

బ్రాహ్మణ సత్యాగ్రహ దీక్షలో జీవితారాజశేఖర్ పాల్గొని మాట్లాడారు.  ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కేంద్రప్రభుత్వం కల్పించిన 10శాతం రిజర్వేషన్ ను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని సినీ నటి జీవితారాజశేఖర్ డిమాండ్ చేశారు.

ఎస్సీ - ఎస్టీ - బీసీల రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలుగకుండా కేంద్రం కల్పించిన 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కేసీఆర్ - జగన్ సర్కార్ లు ఎందుకు అమలు చేయడం లేదని జీవిత ప్రశ్నించారు.ప్రధాని మోడీ ప్రజల కోసం ఎన్నో పథకాలు చేపడుతున్నారని జీవిత కొనియాడారు.

దీక్షలో పాల్గొన్న మల్లాది పవన్, యజ్ఞం పవన్ లు మాట్లాడుతూ బ్రహ్మణ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  తరుఫున వేణుగోపాలచారి రిజర్వేషన్ల అమలు గురించి సీఎంతో మాట్లాడతానని చెప్పడంతో దీక్షను విరమిస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News