అంబానీ ఆస్తులు యాభై వేల కోట్లేనా?

Update: 2020-04-15 16:44 GMT
జెఫ్ బెజోస్‌... అమెజాన్ వ్యవస్థాపకుడు - అపర కుబేరుడు. జెఫ్‌ బెజోస్‌  తన భార్యతో గ‌త ఏడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 25 ఏళ్ల పాటు జీవనం సాగించిన ఈ జంట విడిపోగా సంపదలోనే కాకుండా విడాకుల సెటిల్‌ మెంట్‌ విషయంలో కూడా బెజోస్‌ రికార్డు సృష్టించారు. క‌ట్ చేస్తే... ఈ ఇద్ద‌రూ ఇప్పుడు తాజాగా రికార్డు సృష్టించారు. ఇదంతా క‌రోనా క‌ల‌క‌లం స‌మ‌యంలో. అదే స‌మ‌యంలో భార‌తీయ కుబేరుడు ముఖేష్‌ ను మించిపోయిన సంపాద‌న‌తో కావ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న అంశం.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్‌ డౌన్ కొన‌సాగుతోంది. అందులో భార‌త్ ఉంది. నేరుగా వెళ్లి కొనుగోలు చేసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు అమెజాన్ ఆన్‌ లైన్ సేవ‌ల‌పై ఆధార‌ప‌డుతున్నారు. దీంతో ఆ సంస్థ షేరు భారీగా పెరుగుతోంది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 5.3% శాతం అమెజాన్ పెరిగింది. ఈ పెరుగుద‌ల‌తో బెజోస్ ఆస్తి $ 138.5 బిలియ‌న్ల‌కు చేరింది. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్‌. అమెజాన్ సంస్థ‌లో వాటాలు ఉన్న బెజోస్ భార్య ఆస్తి కూడా పెరిగింది.

బెజోస్ తో విడాకుల ఒప్పందంలో భాగంగా 37 బిలియన్‌ డాలర్ల(దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) విలువ కలిగిన 19.7 మిలియన్‌ అమెజాన్‌ షేర్లను జెఫ్‌ బెజోస్‌ మెకాంజీ పేరిట బదలాయించారు. దీంతో ఆమె ఫోర్బ్స్‌ సంపన్న మహిళగా నిలవడంతో.. పాటు విశ్వంలో ఉన్న సంపన్నుల జాబితాలో 23వ స్థానం దక్కించుకున్నారు. తాజా ప‌రిణామంతో ఆమె ఆస్తులు కూడా 8.2 బిలియ‌న్ డాల‌ర్లు పెరిగాయి. దీంతో ఆమె రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని వెన‌క్కు నెట్టేసింది. అయితే - అంబానీ ఆస్తులు యాభై వేల కోట్లేనా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News