ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెరవెనుక ఉన్నాడన్న ఆరోపణలను ఇన్నాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుర్కొన్నాడు. ‘బ్రీఫ్ డ్ మి’ అన్న ఆయన మాటలు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఓటుకు నోటు కేసులో తాజాగా చంద్రబాబు పాత్ర ఉన్నట్టు.. నిందితుడు జేరూసలేం ముత్తయ్య ఈడీ విచారణలో అంగీకరించాడు. ముత్తయ్య వాంగ్మూలాన్ని ఈడీ రికార్డ్ చేసింది.
చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డితో కలిసి స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టినట్టు ముత్తయ్య తాజాగా ఒప్పుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడం కోసం డీల్ మాట్లాడినట్టు ముత్తయ్య ఈడీ విచారణలో అంగీకరించినట్టు సమాచారం. సెబాస్టియన్ ను సంప్రదించి డీల్ ఓకే చేసినట్టు చెప్పినట్టు తెలిసింది.
డీల్ సెట్ చేసినందుకు 50 లక్షలు ఆఫర్ ఇచ్చారని ముత్తయ్య అంగీకరించారని సమాచారం. లోకేష్ సలహా మేరకు ఏపీకి వెళ్లానని ముత్తయ్య తాజాగా ఈడీకి తెలిపినట్టు సమాచారం.